MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు. అధికారం పోయిన తర్వాత కవిత చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా?, మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా?, అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా?’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నాయకత్వంలో, సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని, నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజా పాలన అని స్పష్టం చేశారు. ‘ఎవరికైనా నష్టం జరిగిదే… స్వేచ్ఛ గా ఇందిరాపార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛ ను ఇచ్చింది. ఇందిరాపార్కు మాత్రమే కాదు… ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెల్లినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే… కులగణన చేసి సామాజిక తెలంగాణ సాదిస్తున్నాం. కొత్త సెలబస్ తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది.
బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇంకో పదేళ్లు ఉంటుంది. బిఆర్ఎస్ అధికారంలోకి తెచ్చుకుని బందీలుగా ఉండాలని ఎవరూ అనుకోరు.కేసీఆర్ పదేళ్ల లో సామాజిక తెలంగాణ కోసం పనిచేయలేదని కవిత చెప్పకనే చెప్పింది.కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’ అని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి.
ఈ నెల 16న అమెరికాకు ఎమ్మెల్సీ కవిత
ఈ నెల 16న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరుకానున్నారు. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరి… ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ.. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.