Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అభినందనల వెల్లువ

'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనల వెల్లువ

Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అంటూ మద్దతు పలుకుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జైహింద్ అంటూ ఎక్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జైహింద్‌.. జైహింద్‌కీ సేనా అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.

‘భారత్ మాతాకీ జై’ అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh) తెలిపారు. భారత్‌ మాతాకీ జై అంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ స్పందించారు. భారత్ మాతాకీ జై… జైహింద్ అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోస్ట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. మేరా భారత్ మహాన్… జైహింద్ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్‌ఫర్ టెర్రరిజం భారత్ మాతాకీ జై అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు.

Operation Sindoor – ఆపరేషన్ సిందూర్‌ చరిత్రాత్మకం – రఘురామ కృష్ణరాజు

ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి రఘురామ కృష్ణరాజు అభినందనలు తెలిపారు.

ఉగ్రవాదంపై భారత్ పోరాడాలి: సీపీఐ నారాయణ

ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్, పాకిస్తాన్ ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. టెర్రిరిజం వల్ల పాక్తిసాన్ కూడా అంతర్గతంగా నష్టపోతోందని చెప్పారు. టెర్రరిజంపై పోరాడాల్సిన బాధ్యత ఇండియాకు ఉందని తెలిపారు. అయితే పాకిస్తాన్‌(Pakistan) తో యుద్దం కంటే ఉగ్రవాదంపై యుద్దం ముఖ్యమని అన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్దం వల్ల ఉగ్రవాదులు మరింత బలపడతారని నారాయణ చెప్పారు.

పాక్ ఉగ్రవాదులకు భారత్ సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది – మంత్రి అనగాని

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత్ సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైందని అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా ఏరివేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) చెప్పిన మాటలు నిజమయ్యాయని చెప్పారు. ‘మేరా భారత్ మహాన్… జైహింద్’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

ఆపరేషన్‌ సిందూర్‌’కు టీడీపీ పూర్తి మద్దతు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ లో బుధవారం ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ జెండాలు పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వందేమాతరం అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత బలగాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ, వేపాడ చిరంజీవి, టీడీపీ నేతలు వర్ల రామయ్య, అశోక్ బాబు, ఏవీ రమణ, బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌ని ప్రతీ భారతీయుడు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రతీగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు స్పష్టం చేశారని అన్నారు. మన సైన్యానికి యావత్ భారతావని అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాకిస్థాన్ చేసిన తప్పు ప్రపంచానికి చాటేలా భారత్ బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ప్రతీ భారతీయుడు ఈ చర్యను స్వాగతిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు.

పహల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ఆపరేషన్ సిందూర్ భారతదేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. పహేల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. ఉగ్రవాదం అంతమయ్యేంతవరకు ఇది కొనసాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని.. ఉగ్రవాదులకు స్థావరాలను కల్పించడం మానేయాలని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నడుస్తున్న అద్భుతమైన పాలన మాటలతో కాదు చేతలతో సమాధానం చెబుతారని మరోసారి నిరూపితమైందని అన్నారు. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను తెల్లవారుజామున మట్టుబెట్టిన భారతసైన్యానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ శక్తి సామర్ధ్యాల ముందు పాకిస్తాన్ పనికిరాదు – మాజీ సైనిక అధికారులు

పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావటంతో మాజీ సైనికులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే భారత సైన్యానికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనిక అధికారులు మాట్లాడాడుతూ… భారత సైన్యం అపారమైన సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. భారత్ ఆధునిక ఆయుధ సంపత్తి, శక్తి సామర్ధ్యాల దగ్గర పాకిస్తాన్ ఎందుకు పనికిరాదని మాజీ సైనిక అధికారులు వెల్లడించారు.

Also Read : CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!