Pawan Kalyan: “ఆపరేషన్ సిందూర్” పాకిస్తాన్ కు ఒక గుణపాఠం – పవన్ కళ్యాణ్
"ఆపరేషన్ సిందూర్" పాకిస్తాన్ కు ఒక గుణపాఠం - పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)” చేపట్టిన విషయం తెలిసిందే. “ఆపరేషన్ సిందూర్” లో భాగంగా పాకిస్తాన్ భూ భాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ రక్షణ దళాలు బుధవారం తెల్లవారుజామున మిసైళ్ళ వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం కాగా… పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్” పై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు.
‘‘పహల్గాంలో హిందువులా? కాదా? అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉంది. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలి.. అండగా నిలవాలి. చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ఆయన పోరాటం ఆగదు. పాకిస్థాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి… ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి చెందిన ఇద్దరు కుటుంబాలతో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి బారత్ సేనలు పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలనుధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలకకుండా, ప్రాణ నష్టం జరగకుండా… కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
Pawan Kalyan – మోదీ ఉన్నంతవరకు మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు – మంత్రి నారా లోకేశ్
పహల్గాం విషాదానికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాజాగా ఈ ఘటనపై ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడాన్ని హర్షిస్తూ ఎక్స్ వేదికగా 54 సెకన్ల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని కొన్ని మాటలు, నరేంద్ర మోదీ ప్రసంగం, భారత సైన్యం ఉగ్రవాదులపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలతో కూడిన 54 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.’మన నేల పై మొలిచిన మొక్క కూడా పీకలేరు! వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ’ అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం లోకేశ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Former Employees Union: జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన మాజీ ఉద్యోగ సంఘం నేతలు