Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా మహిళల ధర్నా
మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా మహిళల ధర్నా
Miss World 2025 : హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రపంచంలోని సుమారు 120 దేశాల నుండి సుందరాంగులు పాల్గొంటున్నారు. అయితే పాశ్చాత్య సంస్కృతి అయిన మిస్ వరల్డ్ పోటీలను నిరసిస్తూ వివిధ మహిళా సంఘాల నేతలు గచ్చిబౌలి స్టేడియం వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. మిస్ వరల్డ్(Miss World 2025) వేడుకల ప్రారంభోత్సవం సమయంలో భారీ బందోబస్తు ఉన్నా పోలీసుల కళ్లు గప్పి స్టేడియం ప్రధాన ద్వారం సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ గచ్చిబౌలి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Miss World 2025 Updates
అనంతరం వారిని వాహనంలో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉద్విగ్న భరిమైన పరిస్థితుల్లో అందాల పోటీలను నిర్వహించడమేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని చెబుతూనే రూ.200 కోట్లు ఖర్చుపెట్టి మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నేతలు వి.సంధ్య, ఝాన్సీ, అనురాధ, ఐఎఫ్‌టీయూ అరుణ, మహేష్, నాగరాజు, వివిధ మహిళా సంఘాల నేతలు ఎడ్ల జయ, రాణి, జయసుధ, సావిత్రి, సవిత, శ్రీఏదేవితోపాటు సింహద్రి, రవి పాల్గొన్నారు.
Also Read : Pakistan PM: యుద్ధంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ! మేమే గెలిచాం అంటూ తప్పుడు కూతలు !