MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Mega Reddy : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపించారు. కృష్ణానది స్థలాన్నిఆయన ఆక్రమించారని విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి(MLA Mega Reddy) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ నది పరివాహక ప్రాంతంలో మట్టిని తోడేస్తూ, దుర్వినియోగం చేస్తూ ఆయన భూ కబ్జాల నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివారులోని సర్వే నంబరు 57లో విలువైన భూమిని నిరంజన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని మండిపడ్డారు. వారు ఆ భూమిని కబ్జా చేసినట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి చెప్పారు.

MLA Mega Reddy Shocking Comments

గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి రూ.25 లక్షల సబ్సిడీ తీసుకుని ఆయన బిడ్డల పేర్ల మీద ఆ భూమిని మార్చుకున్నారని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని అన్నారు. నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ సస్పెండ్ చేస్తారా, సమర్థిస్తారా తేల్చాలంటూ సవాల్ విసిరారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Telangana Police: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ! భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు !

Leave A Reply

Your Email Id will not be published!