Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్ళూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసారు. ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో నందిగం సురేష్‌(Nandigam Suresh) ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. నందిగం సురేష్ అరెస్ట్‌పై సమాచారం అందుకున్న అతడి భార్య బేబీ లతా… తుళ్లూరు పోలీస్ స్టేషన్‌‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించారు. తన భర్త నందిగం సురేష్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అయితే తన భర్త రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh) దాడి చేశారంటూ లక్ష్మీ అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీనితో అతడిని చికిత్స నిమిత్తం శనివారం రాత్రి మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Nandigam Suresh – అసలేం జరిగిందంటే ?

శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలోకి వేగంగా కారు దూసుకొచ్చింది. కారు అతివేగంపై డ్రైవర్‌ ను ఇసుకపల్లి రాజు మందలించారు. అక్కడికి కాసేపటి తర్వాత సురేశ్‌ అనుచరులు వచ్చి అతడిపై దాడి చేసి… సురేశ్‌ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ మరోసారి సురేశ్‌, అతడి అన్న ప్రభుదాసు, బంధువులు రాజుపై దాడి చేశారు. గాయాలపాలైన రాజుని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అనంతరం రాజు భార్య లక్ష్మీ.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నందిగం సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సురేష్ సోదరుడు, బంధువుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : AP Capital: రాజధాని అమరావతికి మరో మణిహారం ?

Leave A Reply

Your Email Id will not be published!