Shubman Gill : గిల్ మరియు పంత్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన బీసీసీఐ
టెస్ట్ జట్టులో దాదాపుగా అందరికీ న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...
Shubman Gill : టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్రమోషన్ కొట్టేశాడు. భారత టెస్ట్ జట్టు కొత్త సారథిగా అతడ్ని నియమించింది బీసీసీఐ(BCCI). గిల్‌కు డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే భారత జట్టును తాజాగా ప్రకటించింది బీసీసీఐ(BCCI). జూన్ 20 నుంచి జరిగే 5 టెస్టుల ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన భారీ బృందాన్ని ఎంపిక చేసింది బోర్డు. ఈ జట్టులో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. అలాగే శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్నారు.
Shubman Gill As a Captain
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్)
రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్)
యశస్వి జైస్వాల్
కేఎల్ రాహుల్
సాయి సుదర్శన్
అభిమన్యు ఈశ్వరన్
కరుణ్ నాయర్
నితీష్ కుమార్ రెడ్డి
రవీంద్ర జడేజా
ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)
వాషింగ్టన్ సుందర్
శార్దూల్ ఠాకూర్
జస్‌ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
ప్రసిద్ధ్ కృష్ణ
ఆకాశ్‌దీప్
అర్ష్‌దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్.
టెస్ట్ జట్టులో దాదాపుగా అందరికీ న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీల్లో అదరగొడుతున్న కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, శార్దూల్ ఠాకూర్‌ను టీమ్‌లోకి తీసుకోవడమే దీనికి ఉదాహరణ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జట్టు దుర్భేద్యంగా ఉందని చెబుతున్నారు. అయితే సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఉండి ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చెబుతున్నారు. కాగా, వెన్ను గాయం కోలుకొని నుంచి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు షమి. అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ఇంత త్వరగా టెస్టుల్లో ఆడించడం అతడి కెరీర్‌కు ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో ఈ టూర్‌కు ఎంపిక చేయలేదని వినిపిస్తోంది.
Also Read : India Test Team Squad : ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్..ఇండియా స్క్వాడ్ వేరే