Pinnelli Ramakrishna Reddy : టీడీపీ కీలక నేత దారుణ హత్య.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరులపై కేసు
గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేశారు...
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గంలో శనివారం నాడు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను దారుణంగా హత్యచేశారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్దులు ఢీకొట్టారు. కిందపడిన ఇద్దరిని గొడ్డళ్లతో నరికి ప్రత్యర్దులు చంపేశారు. వైసీపీ ప్రభుత్వంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపేశారు. తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలను హత్య చేశారు.
Pinnelli Ramakrishna Reddy Brothers Case
గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) సోదరులపై కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై 302 సెక్షన్ కింద కేసు చేశారు. ఏ 1 జవిశెట్టి శ్రీను, ఏ 2 తోట వెంకట్రామయ్య, ఏ 3 తోట గురువయ్య, ఏ 4 డి. నాగరాజు, ఏ 5 తోట వెంకటేశ్వర్లు, ఏ 6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ 7 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పల్నాడులో టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులపై దారుణ హత్య వార్త తీవ్రంగా కలిచివేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వేటకోడవళ్లతో పాశవికంగా పిన్నెల్లి సన్నిహితులు హత్య చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ పిన్నెల్లి అనుచరులు విఘాతం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పిన్నెల్లి అనుచరులు మళ్లీ పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. •కూటమి పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేదని హెచ్చరించారు. పిన్నెల్లి, అనుచరులపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
Also Read : Minister Kishan Reddy : మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మరింత మమేకమవుతున్న ప్రధాని