Minister Bala Veeranjaneya : జగన్ ఇప్పటికైనా మారకపోతే ఆ 11 సీట్లు కూడా రావని గుర్తు పెట్టుకోవాలి

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడారు...

Bala Veeranjaneya : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని.. దళితులను జగన్ దగా చేసిన చరిత్ర ఎవ్వరూ మర్చిపోలేరని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దళితుల్ని అడ్డం పెట్టుకుని జగన్(YS Jagan) చేసే కుట్ర పూరిత రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వు నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని.. ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Bala Veeranjaneya) స్పష్టం చేశారు.

Minister Bala Veeranjaneya Slams

ఏపీలో అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి సరైన తీర్పు ఇచ్చిన రోజు జూన్ 4 అని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా ప్రజలు తరిమికొట్టారని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ప్రకాశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ప్రజల తీర్పు జీర్ణించుకోలేక జూన్ 4 వెన్నుపోటు దినంగా చెబుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు.

ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎవరినీ తాము వేధించడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని మంత్రి విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తరిమికొడితే… అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరిగి పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు.

Also Read : Operation Spiderweb : సినిమా స్టైల్ లో రష్యాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్

Leave A Reply

Your Email Id will not be published!