BSF Jawan Kidnapped : బీఎస్ఎఫ్ జవాన్ ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు

వారందరూ బంగ్లాదేశ్‌లోని చపాయ్ నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారేనని తెలుస్తోంది...

BSF Jawan Kidnapped : భారత్ సెక్యూరిటీ ఫోర్స్‌ కు చెందిన ఓ జవాన్‌ను బంగ్లాదేశ్ వాసులు కిడ్నాప్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ బీఎస్‌ఎఫ్ జవాన్‌ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేసి అతడిని బందీగా ఉంచారు. కొన్ని గంటల తర్వాత అతడిని విడుదల చేశారు. నుర్ఫుర్ జిల్లాలోని కథాలియా అనే గ్రామం దగ్గర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

BSF Jawan Kidnapped…

సుతిర బీఎస్‌ఎఫ్ క్యాంప్ సమీపంలోని చాందనిచౌక్ దగ్గర గల అంతర్జాతీయ సరిహద్దు నుంచి కొందరు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని ఆ బీఎస్‌ఎఫ్ జవాన్ అడ్డుకున్నాడు. దాంతో అతడిని ఆ ముష్కరులు కిడ్నాప్ చేసి బందీ చేశారు. వారందరూ బంగ్లాదేశ్‌లోని చపాయ్ నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారేనని తెలుస్తోంది.

బీఎస్‌ఎఫ్ జవాన్ కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొన్ని గంటల్లోనే ఆ జవాన్‌ను ముష్కరులు విడిచిపెట్టేశారు. ప్రస్తుతం ఆ జవాన్ క్షేమంగానే ఉన్నాడని సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్‌ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ కిడ్నాప్ ఘటనపై దర్యాఫ్తు జరుగుతోంది.

Also Read : BCCI Slams : చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. ఆర్సీబీ పై బీసీసీఐ ఘరమ్

Leave A Reply

Your Email Id will not be published!