Trump-US : అమెరికాలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న అక్రమ వలసదారుల ఏరివేత
అయితే ఒక్క రోజులోనే ఇంత మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే ఇదే ప్రధమమని స్పష్టం చేసింది...
Trump : అమెరికాలో వలసదారుల అరెస్టులు ప్రారంభమైనాయి. ఆ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2, 200 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఒక్క రోజులోనే ఇంత మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్‌బీసీ న్యూస్ గురువారం వెల్లడించింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఒక్క రోజులోనే 3 వేల మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారని పేర్కొంది. ఆ క్రమంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయని తెలిపింది. అయితే ఒక్క రోజులోనే ఇంత మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే ఇదే ప్రధమమని స్పష్టం చేసింది.
Trump-Illegal Immigrants
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐసీఈ అధికారులు అల్టర్‌నేటివ్ టు డిటెక్షన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కింద పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. యాంకిల్ ద్వారా స్మార్ట్ యాప్స్‌తోపాటు జియో లోకేషన్ పరికరాల ద్వారా వారిని పర్యవేక్షిస్తుంటారు. అలాగే వారు తరచూ ఐసీఈ కేంద్రాలకు రావల్సి ఉంటుందని ఇప్పటికే వారికి అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఏడీటీలో నమోదైన వలసదారులు ఐసీఈ కార్యాలయాలకు రావాలంటూ సందేశాలు పంపుతున్నారు. అలా వచ్చిన వారిని అరెస్ట్ చేసి కార్లలో తరలిస్తున్నారు. గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరు కానీ వారిని దేశం విడిచి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. గతంలో వలసదారులను వెనక్కి పంపిస్తామని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్య కాక పోవచ్చునని ఐసీఈ అధికారి అభిప్రాయపడ్డారు.
Also Read : Minister Atchannaidu : గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీలను అవినీతి మయం చేసారు