NDA 2025 Recruitment : ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు..

ఎంపికైన అభ్యర్థులు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గౌరవప్రద విభాగాల్లో..

NDA 2025 Recruitment : భారత రక్షణ దళాల్లో చేరే ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) రెండో విడత (NDA II) కోసం 406 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ నోటిఫికేషన్‌ను మే 28, 2025న విడుదల చేయగా, జూన్ 17, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గౌరవప్రద విభాగాల్లో సేవ చేసే అవకాశాన్ని పొందుతారు.

NDA 2025 Recruitment Updates

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 28, 2025

ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు: జూన్ 17, 2025 (రాత్రి 11:59 గంటల వరకు)

రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14, 2025

అడ్మిట్ కార్డుల విడుదల: సెప్టెంబర్ మొదటి వారం

అర్హతలు
వయోపరిమితి: అభ్యర్థులు జనవరి 2, 2007 నుండి జనవరి 1, 2010 మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హత:

ఆర్మీ: ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత.

ఎయిర్ ఫోర్స్ / నేవీ / 10+2 క్యాడెట్ స్కీమ్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉండే 12వ తరగతి ఉత్తీర్ణత.

జాతీయత: భారతీయులు, నేపాల్/భూటాన్ పౌరులు లేదా ఇతర నిర్దిష్ట ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు.

దరఖాస్తు ఫీజు
సాధారణ/OBC అభ్యర్థులు: ₹100

SC/ST/మహిళా అభ్యర్థులు/ JCOs, NCOs, ORs వారసులు: ఫీజు లేదు

పరీక్ష విధానం
రాత పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది:

గణిత శాస్త్రం: 300 మార్కులు – 2.5 గంటలు

జనరల్ అబిలిటీ టెస్ట్ (GAT): 600 మార్కులు – 2.5 గంటలు

మొత్తం మార్కులు: 900

రాత పరీక్ష ఉత్తీర్ణులైన వారికి SSB ఇంటర్వ్యూ (900 మార్కులు) ఉంటుంది.

జీత భత్యాలు (నెలకు)

కేడెట్ ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: ₹56,100

Lieutenant: ₹56,100 – ₹1,77,500

Captain: ₹61,300 – ₹1,93,900

Major: ₹69,400 – ₹2,07,200

Lieutenant Colonel: ₹1,21,200 – ₹2,12,400

Colonel: ₹1,30,600 – ₹2,15,900

Brigadier: ₹1,39,600 – ₹2,17,600

Major General: ₹1,44,200 – ₹2,18,200

Lieutenant General (HAG Scale): ₹1,82,200 – ₹2,24,100

మిలిటరీ సర్వీస్ పే (MSP): ₹15,500

దరఖాస్తు ప్రక్రియ : 

అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.

స్కాన్ చేసిన ఫోటో, సంతకం, ఐడీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.

ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి.

Also Read : CM Chandrababu : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Leave A Reply

Your Email Id will not be published!