Manipur High Tension : మైతేయి నాయకుల అరెస్ట్ మల్లి మొదలైన అల్లర్లు

బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించింది...

Manipur : జాతుల వైరంతో కొద్దికాలంగా అట్టుడుకుతూ వచ్చిన మణిపూర్‌లో(Manipur) మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మైతేయి సంస్థ అరాంబాయ్ టెంగోల్ కు చెందిన పలువురు నేతలను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఐదు జిల్లాలో ఇంటర్నెట్, మొబైల్ డాటా సర్వీసులను అధికార యంత్రాంగం నిలిపివేసింది. బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించింది.

Manipur High Tension Again

అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో ప్రదర్శకులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కావాకేథేల్ ఔట్‌పోస్టుపై నిరసనకారులు దాడికి దిగారు ఈ ఘర్షణల్లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక పౌరుడు గాయపడ్డారు.

ఆరాంబాయ్ టెంగోల్‌కు చెందిన ఐదుగురు వలంటీర్లను ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు వార్తలు రావడంతో ఉద్రికతలు నెలకొన్నాయి. అయితే ఈ అరెస్టులను అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. నిరసనల నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్, బిష్ణుపూర్, కాక్‌చింగ్ జిల్లాల్లో శనివారం రాత్రి 11.45 నుంచి ఐదురోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డాటా, వీఎస్ఏటీ, వీపీఎన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బిష్ణుపూర్ జిల్లాలో అయితే కర్ఫ్యూ సైతం విధించారు. శాంతి భద్రతల పరిస్థితి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయనే కారణంగా ఈ ఆంక్షలు విధిస్తున్నామని, వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ ఎన్.అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకున్న జిల్లాల్లో భద్రతా బలగాలను మోహరించగా, అ్లలరిమూకను చెదరగొట్టేందుకు బలగాలు పలురౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. అల్లర్లు విస్తరించకుండా అదనపు బలగాలను మోహరించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఆరాంబాయ్ టెంగోల్ అనేది మణిపూర్(Manipur) ప్రాంతంలో చురుకుగా ఉన్న మైతేయి యూత్ గ్రూప్. జాతుల ఘర్షణ సమయంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌లో కీలక భూమిక పోషించినట్టు చెబుతుంటారు. ఇటీవల చోటుచేసుకున్న అలజడుల్లో వీరి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం, వీరిలో కొందరిని అరెస్టు చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమవుతోంది.

Also Read : KCR : ఎమ్మెల్యే ‘మాగంటి గోపీనాథ్’ భౌతికకాయాన్ని బోరున విలపించిన మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!