AP Rains : ఏపీలో వచ్చే 3 రోజులు ఆ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
ఉక్కపోత, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొనవచ్చు...
AP Rains : దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర అంతర్భాగ కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్(AP) వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. యానాం సహా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపోస్ఫియర్లో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల రాబోయే మూడు రోజులలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుపుతూ వాతావరణ శాఖ సూచనలు విడుదల చేసింది.
AP Rains – ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
ఈరోజు:
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చును. ఉక్కపోత, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొనవచ్చు.
రేపు:
ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు కొనసాగవచ్చును.
ఎల్లుండి:
కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈరోజు:
ఒకటి రెండు చోట్ల తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొనవచ్చు.
రేపు, ఎల్లుండి:
కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఉరుములు, బలమైన గాలులు కనిపించే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి:
కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములతో కూడిన మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.
తెలంగాణ(Telangana):
ఈరోజు (ఆదివారం):
కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం):
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కొన్నిచోట్ల కురవచ్చు.
గాలుల వివరాలు:
ఈ మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
Also Read : Manipur High Tension : మైతేయి నాయకుల అరెస్ట్ మల్లి మొదలైన అల్లర్లు
