MLA Raja Singh vs Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై గోషామహల్ పరోక్ష విమర్శలు

నోరు ఉందని కానీ చెప్పరంటూ రాజా సింగ్ ఎద్దేవా చేశారు...

Raja Singh : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. పరోక్ష విమర్శలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా.. వినపడవని అన్నారు. నోరు ఉందని కానీ చెప్పరంటూ రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులకు అడిగితే ఏం సహాయం చేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా విమర్శించారు.

MLA Raja Singh vs Kishan Reddy Comments

గత కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh) మధ్య అంతర్గతంలో కోల్డ్ వార్ జరుగుతోన్నట్లు బీజేపీలో అంతర్గతంగా ఓ చర్చ అయితే నడుస్తోంది. దీనిపై పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విలేకర్లు ప్రశ్నించినా.. అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. అయితే పార్టీలో చిన్న చిన్న పొరపొచ్చలు ఉన్నా వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని తామే పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యే రాజా సింగ్ భిన్న వైఖరిని అవలంబిస్తున్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సైతం అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే.. రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సముదాయించిన విషయం విదితమే. అనంతరం పలు సందర్భాల్లో సైతం కిషన్ రెడ్డిని రాజా సింగ్ పరోక్షంగా విమర్శించిన సందర్బాలు అనేకం ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ఇంకోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్‌ వైఖరిపై పార్టీ అగ్రనాయకత్వం గుర్రగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఇటీవల ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు సైతం జరిగాయి. ఆ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో కేంద్రంలోని పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. కానీ ఎందుకో.. మళ్లీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Also Read : AP Rains : ఏపీలో వచ్చే 3 రోజులు ఆ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!