Minister Konda Surekha : తెలంగాణ బోనాల పండుగకు 20 కోట్లకు పైగా కేటాయింపులు

జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని....

Konda Surekha : నగరంలో ప్రసిద్ధి చెందిన పండుగ బోనాల ఉత్సవాలు అని .. త్వరలో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలపై మంగళవారం అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి కొండా సురేఖ(KOnda Surekha) తెలిపారు. పండుగ కోసం ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని.. రూ. 20 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ఏడాది బోనాల పండుగ జరుపుకున్నామని, ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు తలెత్తాయని.. ఈ సారి ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వీఐపీ మూమెంట్‌లో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, అవి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Minister Konda Surekha

జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. గతంలో జరిగిన దానికంటే ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని అన్నారు. అధికారులు సమన్వయంతో ఉండి డ్యూటీ చేయాలని.. సంయమనం పాటించాలని కోరుతున్నామన్నారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ దర్శనం చేయించాలన్నారు. గత ఏడాది బోనాల సమయంలో పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్ అయిందని.. ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు.

2024 యాక్షన్ ప్లాన్‌ను సరిచేసుకుని 2025లో ప్లాన్ రెడీ చేసుకోవాలని అధికారులకు సూచించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకోవాలన్నారు. గోల్కొండ జగదాంభిక అమ్మవారి తొలి బోనంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. గోల్కొండ జాతర, బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కల్యాణోత్సవం, లష్కర్, లాల్ దర్వాజ బోనాలు, అమ్మవారి అంబారి ఊరేగింపు, రంగం కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈసారి బోనాలకు ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసిందన్నారు. నూతన దేవాలయాలు యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకో 10 శాతం ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎండోన్మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్యూటీ లా కాకుండా ప్రతి ఒక్కరు అమ్మవారి ఆజ్ఞతో సేవ చేస్తున్నామని అనుకోవాలన్నారు. అన్ని డిపార్టుమెంట్‌లు ఎక్కడ ఇష్యూ లేకుండా చూసుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Also Read : Minister Ramanaidu : పోలవరం పనులు జరగడం చూసి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!