Minister Atchannaidu : శ్రీకాకుళంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు

ఇందుకు రూ.260 కోట్లు అవసరమవుతుందని..

Minister Atchannaidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర సహాయంతో మరిన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ సంబంధిత సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను (Shivraj Singh Chouhan) కలిసిన ఆయన, రాష్ట్రంలోని రైతుల సమస్యలు, అవసరాలపై వివరణ ఇచ్చారు.

Minister Atchannaidu – “విభజన చట్టం ప్రకారం విశ్వవిద్యాలయం అవసరం”

విభజన సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. అలాగే,

  • గుంటూరులో మిర్చి బోర్డు
  • చిత్తూరులో మామిడి బోర్డు
  • శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు

ఇవన్నీ కేంద్ర సహకారంతో ఏర్పాటు చేయాలని సూచించారు.

మామిడి రైతులకు మద్దతు ధర, నష్టం భర్తీపై విజ్ఞప్తి

మామిడి రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్‌ సమస్యలు మరియు తోతాపురి మామిడికి మద్దతు ధర విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన అచ్చెన్నాయుడు, ప్రస్తుతం ప్రభుత్వం కిలోకు ₹12 మద్దతు ధర నిర్ణయించిందని, ఇందులో కంపెనీలు ₹8 చెల్లిస్తే, ప్రభుత్వం ₹4 భరిస్తుందని తెలిపారు. ఇందుకు రూ.260 కోట్లు అవసరమవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం కనీసం ₹130 కోట్లు ధర లోటు పరిహారంగా ఇవ్వాలి అని సూచించారు.

వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్‌ పథకం సబ్సిడీ పెంపు

ఉత్తర కోస్తా, రాయలసీమకు చెందిన వెనుకబడిన 8 జిల్లాల్లో ఉన్న ఉద్యాన రైతులకు మైక్రో ఇరిగేషన్‌పై అదనపు సబ్సిడీ అవసరమని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఇచ్చిన మాదిరిగా, ఆంధ్రప్రదేశ్‌కూ ప్రత్యేక సహాయం అవసరమని కేంద్రాన్ని కోరారు.

మత్స్య, పశుసంవర్ధక రంగాల అభివృద్ధిపై దృష్టి

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మరింత సహకారం అందించాల్సిందిగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్ (లాలన్‌ సింగ్)‌ను కూడా కలిశారు. అలాగే, విజయనగరం జిల్లా గరివిడిలో వెటర్నరీ కాలేజీకి కేంద్ర గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం స్పందన

ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : AV Ranganath : ఫాతిమా కాలేజీ పై వస్తున్న విమర్శలపై స్పందించిన హైడ్రా కమిషనర్

Leave A Reply

Your Email Id will not be published!