Murder: భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

Murder : తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు… అత్తను చంపిన ఘటన జరిగింది. నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

కొన్నేళ్లుగా భార్యను కాపురానికి పంపడం లేదని అత్త చెంగమ్మ(47)పై అల్లుడు వెంకయ్య కక్షగట్టాడు. ఆత్మహత్యకు పాల్పడతానని ఆమెను ఫోన్‌లో బెదిరించాడు. ఈ క్రమంలో అత్తను అయ్యపరెడ్డిపాలేనికి రప్పించాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచి చంపాడు (Murder). అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. గ్రామస్థులు, బంధువులు నిలదీయడంతో నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. దీంతో వెంకయ్యను గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. దీనిపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Murder – బాపట్లలో తండ్రీకుమారుల దారుణ హత్య

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో జంట హత్యలు కలకలం రేపాయి. పాతమాగులూరులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో తండ్రి, కుమారుడి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కుమారుడు కె.వి.ప్రసాద్‌రెడ్డి (37) నిన్న సాయంత్రం కోర్టు పనిమీద పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు.

బుధవారం ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు… తండ్రి, కుమారుడిని కిడ్నాప్‌ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోకి తీసుకెళ్లి ఇద్దరినీ హత్య చేసి పరారయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మధ్య విభేదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అనిల్‌రెడ్డి అనే వ్యక్తితో వీరాస్వామిరెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. లావాదేవీల్లో తేడాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీరాస్వామిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read : CM Chandrababu: దుబాయ్‌ని చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!