MLA Kuna Ravikumar: లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

MLA Kuna Ravikumar : ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై అదే నియోజకవర్గంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న సౌమ్య అనే మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రవికుమార్ (MLA Kuna Ravikumar) తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ… ఆమె ఆత్మహత్యయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. అయితే గత వారం పదిరోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్… మంగళవారం ఏపీకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆయన తీవ్రంగా ఖండించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. తాను జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించానని, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణమని చెప్పారు. వైసీపీ (YSRCP) తోక నాయకులే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తాను శారీరకంగా , మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యేగా ఎవరితోనైనా మాట్లాడతానని స్పష్టం చేశారు.

MLA Kuna Ravikumar Responds on Sexual Harassments Allegations

తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ (MLA Kuna Ravikumar) అన్నారు. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. తాను అందరి ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని, సాక్షి మీడియా చెత్త రాతలు రాస్తోందన్నారు. అడ్మిషన్స్ విషయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమెతో మాట్లాడానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేతో వీడియో కాన్ఫరెన్స్‌కు ఆమె ఏ విధంగా హాజరైందో చూస్తే అర్ధమవుతుందని చెప్పారు. జూన్ 2న స్కూల్ తెరవకుండా 12న ఓపెన్ చేశారన్నారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోమని జిల్లా అధికారులు కోరినట్లు తెలిపారు. బదిలీ చేస్తే వేధింపులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. పొందూరు కేజీబీవీలో జాయినింగ్‌ కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్‌ ను సౌమ్య బెదిరించారని ఆరోపించారు. అక్కడ విధుల్లో జాయిన్ అవ్వవద్దు అంటూ కొత్త ప్రిన్సిపల్‌ను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.

తనపై నిరాధార ఆరోపణలు చేసిన సౌమ్యతో పాటు వైసీపీ (YSRCP) నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్ పేర్కొన్నారు. అలాగే అసెంబ్లీ ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తన నీడ కూడా తాకలేని గల్లీ వైసీపీ నాయకులు.. తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ.. కులం పేరితో బ్లాక్ మెయిల్ చేయటంలో సిద్ధహస్తురాలని చెప్పారు. ఇలాంటి కుట్రలు తనను ఏమీ చేయలేవని తెలిపారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ నీచ రాజకేయాలు చేయలేదని గుర్తు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేశారు.

 క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే అయినా కఠిన చర్యలు తప్పవు – పల్లా శ్రీనివాసరావు

గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ (TDP) చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం అర్బన్‌ టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే అయినా… ఇంకొకరైనా పార్టీ ఉపేక్షించదన్నారు. కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయబోమని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యేల వ్యవహార శైలిని సీఎం చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించేవిధంగా ఉంటే ఎందుకు ఉపేక్షించాలి? కొన్ని సందర్భాల్లో ఫేక్‌ వీడియోలతో ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో వారు కూడా అప్రమత్తంగా ఉండాలి’’ అని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

అనంతపురం అర్బన్‌ టీడీపీ గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం దృష్టిసారించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ వైఖరిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య కొనసాగుతున్న పంచాయితీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్దకు చేరింది. ఇరువర్గాల నుంచి వివరణ తీసుకుని అధిష్ఠానానికి నివేదిస్తామని ఆయన తెలిపారు.

Also Read : Minister Jitendra Singh: 2040లో చంద్రుడిపైకి భారత వ్యోమగామి – కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!