PM Narendra Modi: ‘ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం’ – క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ
‘ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం’ - క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ
Narendra Modi : తప్పు చేస్తే సీఎం, ప్రధానినైనా తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో.. లేకపోతే బెయిల్‌పై ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు.. జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని మోదీ (Narendra Modi) ప్రశ్నించారు. బిహార్‌లోని గయాజీలో జరిగిన బహిరంగ సభలో రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Narendra Modi Key Comments
నేరారోపణలు ఎదుర్కొన్న నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయి. ఇకపై ఎంతటి నేతైనా 30 రోజులు జైలు శిక్షను అనుభవిస్తే సదరు నేత పదవి కోల్పోనున్నారని స్పష్టం చేశారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేంద్రం పావులు కుదపుతోంది. ఇందులో భాగంగా బీహార్‌లోని గయలో శుక్రవారం ప్రధాని మోదీ రూ.13వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడుతూ… ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ గత పాలనను ‘లాంతర్ యుగం’గా అభివర్ణించారు. తద్వారా రాష్ట్రాన్ని అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టారని ఆరోపించారు.30 కంటే ఎక్కువ రోజుల జైలు శిక్షను అనుభవించిన నేతలు పదవుల్లో కొనసాగే అవకాశం లేకుండా ప్రతిపాదించిన బిల్లుకు మద్దతిచ్చారు. బీహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి, వారి ఆకాంక్షలు, గౌరవం , అభివృద్ధిని విస్మరిస్తున్న పార్టీలను లక్ష్యంగా చేసుకుని‘జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదేశాలు ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేశారు. ‘‘కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశాం. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే.. ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం?’’ అని మోదీ ప్రశ్నించారు.
‘ఒక ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే… డ్రైవర్, గుమస్తా,ఉన్నత ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. కానీ ఒక ముఖ్యమంత్రి, మంత్రి లేదా ఇతర ప్రజాప్రతినిధులు జైలు నుంచి ఆదేశాలు ఇవ్వొచ్చా. కొంత కాలం క్రితం, పలువురు నేతలు జైల్లో ఉండి ఫైళ్లమీద ఎలా సంతకం చేశారో.. జైలు నుండి ఆదేశాలు ఎలా ఇచ్చారో మనం చూశాం. నాయకులు అలా ఉంటే మనం అవినీతిపై ఎలా పోరాడగలం? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) అవినీతికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకపై జైలు నుంచి నేతల పరిపాలన ఉండదు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా ఎవరికైనా ఒకటే రూల్. ఈ బిల్లు చూసి కాంగ్రెస్,ఆర్జేడీ,వామపక్షాలు భయపడుతున్నాయి. పాపం చేసిన వాలల్లకే భయం ఉంటుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును అమిత్ షా ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. తీవ్ర నేరారోపణకు గురై అరెస్టయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. కనీసం అయిదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి, అరెస్టయి, నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు.
Narendra Modi – ఆగస్టు 29 నుండి జపాన్, చైనా పర్యటనకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 29-30 వరకు 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జపాన్‌కు వెళతారు. ఇది ప్రధాని మోదీ జపాన్‌కు ఎనిమిదవ పర్యటన. ఇషిబాతో ప్రధానికి ఇది మొదటి శిఖరాగ్ర సమావేశం అని MEA వెల్లడించింది.
ఈ పర్యటనలో ఇద్దరు నాయకులు భారత్ – జపాన్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ప్రజల మధ్య మార్పిడి(సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిగత సందర్శనలు)ని కవర్ చేసే వ్యూహాత్మక, ఇంకా ప్రపంచ భాగస్వామ్యాన్ని ఇరువురు నేతలు సమీక్షిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కూడా వారు చర్చిస్తారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహ బంధాన్ని పునరుద్ఘాటిస్తుందని MEA తెలిపింది.
తన పర్యటన రెండవ దశలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి చైనాకు వెళతారు. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, ప్రధానమంత్రి శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అనేక మంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం 2017 నుండి SCOలో సభ్యదేశంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, చైనాలోని టియాంజిన్‌లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇచ్చిన సందేశం, ఆహ్వానాన్ని అందజేశారు. ఆగస్టు 18 నుండి 19 వరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారతదేశంలో అధికారిక పర్యటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Lucky Bisht: వెబ్‌సిరీస్‌లో ప్రధాని మోదీ మాజీ బాడీగార్డ్
