Janasena: విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు
విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు
Janasena : విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా విశాఖ చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నాయకులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్టీ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, లోకం నాగ మాధవి, అరవ శ్రీధర్, డిసిసిబి ఛైర్మన్ కోన తాతారావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా (YMCA) వద్ద బే వ్యూ హోటల్ కి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ నాయకులతో జనసేన (Janasena) లెజిస్లేటర్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు.
Janasena Meeting
జనసేన లెజిస్టేటర్ పార్టీ సమావేశం అనంతరం… జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాష్ట్రాభివృద్ధి, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై కార్యవర్గ సభ్యులకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడింది. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయ వాదం ఉంది. పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని పార్టీ నాయకులకు సూచించారు.
Also Read : Rabies: రేబిస్ భయంతో మూడేళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
