#Sarvapindi : సర్వపిండి తయారు చేసుకోవడం ఎలా ?
సర్వ పిండి తెలంగాణలో బామ్మల కాలం నుండి తయారు చేసుకుంటున్న ప్రత్యేక వంటకం.
Sarva pindi : సర్వ పిండి చాలా రుచిగా ఉండే ఈజీగా తయారు చేసుకోగలిగే వంటకం. ఇది తెలంగాణలో బామ్మల కాలం నుండి తయారు చేసుకుంటున్న ప్రత్యేక వంటకం. ఇప్పుడు మనం కూడా చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. దీనికి కావలసిన పదార్ధాలు, తయారు చేయు విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు :
బియ్యంపిండి – 1 కప్పు
ఉప్పు – తగినంత
పల్లీలు – 1/4 కప్పు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
పసుపు – చిటికెడు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్
కారం – 1
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
తయారుచేయు విధానం :
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో అన్ని పదార్ధాలు వేసుకుని తగినన్ని నీళ్లు వేసి ఒక ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని పాన్ మొత్తం రాసుకుని అందులో కొద్దిగా పిండి ముద్ద తీసుకుని పల్చగా ఒత్తుకుని మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 10 నిముషాలు మగ్గించుకుని తర్వాత మరో వైపు తిప్పుకుని మరో 5 నిముషాలు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వ పిండి (Sarva pindi)రెడీ అయినట్లే.
No comment allowed please