Evelyn Sharma : పిల్లలకు పాలివ్వడం అనేది అనాది నుంచి వస్తోంది. ఇది ఎన్నటికీ నేరం కాదు. ఆరోగ్య నిపుణులు సైతం అప్పుడే జన్మించిన పిల్లలకు పాలు ఇవ్వడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
మాతృత్వం, పాలు ఇవ్వడం ఓ వరం దానిని ఎందుకు ప్రదర్శించ కూడదంటూ ప్రశ్నించింది ప్రముఖ నటి ఎవలిన్ శర్మ(Evelyn Sharma ).
తన బ్రెస్ట్ ఫీడింగ్ పోస్టు ట్రోలింగ్ కు గురి కావడంపై స్పందించింది.
పాలు ఇస్తున్నట్టు ఫోటో షేర్ చేయడం ఎందుకు తప్పు అవుతోందంటూ నిలదీసింది. మీరంతా పాలు తాగకుండానే పెరిగారా అంటూ ప్రశ్నించింది ఎవలిన్ శర్మ.
తన కూతురు అవా భిండీకి పాలు ఇస్తున్న ఫోటోను షేర్ చేసింది తన ఇన్ స్టా గ్రామ్ లో.
ఇలా ఎవరైనా ఫోటో పెడతారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసమేనంటూ మండిపడ్డారు.
దీనిపై సీరియస్ అయ్యింది ఎవలిన్ శర్మ. పాపకు పాలు ఇవ్వడాన్ని బహిర్గతం చేయడం బాగోలేదంటూ పేర్కొనడాన్ని ఆమె తప్పు పట్టింది.
ఇది చూపించాల్సిన విషయమా అని కొందరు అనడాన్ని సీరియస్ గా తీసుకుంది.
మాతృత్వంలో ఉన్న మాధుర్యాన్ని, పిల్లలకు పాలిచ్చే తల్లులు పడే సంతోషాన్ని మీరు అర్థం చేసుకోలేరంటూ మండి పడింది ఎవలిన్ శర్మ.
తల్లిగా తన ప్రయాణాన్ని స్నేహితులు, అభిమానులతో పంచు కోవాలని అనుకున్నా. ఇది నా వ్యక్తిగతం. నా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదంటూ స్పష్టం చేసింది ఎవలిన్ శర్మ.
అంతే కాకుండా పాలు ఇచ్చే తల్లులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వేచ్ఛగా ఇవ్వాలని సూచించింది. ప్రకృతి మనకు మాత్రమే ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఓ వరం కూడా అని పేర్కొంది ఈ నటి.
ఇదిలా ఉండగా గతంలో నేహా ధూపియా, సిఖా సింగ్ , లీసా హేడన్ సోషల్ మీడియాలో పాలు ఇచ్చే ఫోటోలు షేర్ చేశారు.
Also Read : తగ్గేదే లేదంటున్న ‘లాల్ సింగ్ చద్దా’