Myanmar Protest : ఆగ‌ని పోరాటం ఆప‌ని ఉక్కుపాదం 

మ‌య‌న్మార్ ఉద్య‌మానికి ఏడాది పూర్తి 

Myanmar Protest  : ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నికైన బ‌ర్మా అలియాస్ మ‌య‌న్మార్ ప్ర‌భుత్వాన్ని (Myanmar Protest)అప్ర‌జాస్వామిక రీతిలో కూల‌దోసి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన సైనిక పాల‌న‌కు ఏడాది పూర్త‌యింది.

ఈ అరాచకాన్ని నిర‌సిస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు మిన్నంటాయి. పెద్ద‌న్న అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా ఇత‌ర దేశాలు చెప్పినా ప‌ట్టించు కోలేదు. దాడులు కొన‌సాగుతున్నాయి.

తూటాలు గుండెల్ని చీల్చుతున్నాయి. కాల్పుల మోత మోగిస్తున్నారు. లెక్క‌లేనంత లెక్కించ‌నంత మందిని పొట్ట‌న పెట్టుకున్నారు.

ప్ర‌ముఖ జాతీయ నాయ‌కురాలు ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించింది.

ఆమెతో పాటు దేశానికి చెందిన వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన వారిని గృహ నిర్బంధంంలో ఉంచింది.

మ‌రో వైపు సైనిక పాల‌న దాష్టీకం చేస్తున్న ఆగ‌డాల గురించి ఐక్య రాజ్య స‌మితి మాన‌వ హ‌క్కుల సంస్థ తాజాగా ఓ నివేదిక రిలీజ్ చేసింది.

ఇందులో దిగ‌భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి. ఈ సంవ‌త్స‌ర కాల సైనిక పాల‌న‌కు వ్య‌తిరేకంగా మిన్నంటిన నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల్లో సాధార‌ణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

1500 మందికి పైగా బ‌ల‌య్యార‌ని స్ప‌ష్టం చేసింది. దాదాపు 12 వేల మందిని అక్ర‌మంగా నిర్బంధించార‌ని వెల్ల‌డించింది.

ఇంకా 9 వేల మంది దాకా ఉన్నార‌ని తెలిపారు ఐరాస మాన‌వ హ‌క్కుల విభాగం రిప్ర‌జెంటేటివ్ ర‌వీనా.

ప్ర‌స్తుతం మ‌య‌న్మార్ లో సైనిక రాజ్యం న‌డుస్తోంది. ప్ర‌పంచ విన్న‌పాల‌ను ప‌క్క‌న పెట్టింది పాల‌క ప‌ర‌మైన జుంటా సైనిక స‌ర్కార్.

అయితే తాజాగా విడుద‌ల చేసిన మాన‌వ హ‌క్కుల నివేదిక అంతా అవాస్త‌వ‌మంటూ ఆరోపించింది.

ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా త‌మ నిర‌స‌న‌ను శాంతియుతంగా చేప‌ట్టారు. కానీ ఆయుధాలు ధ‌రించిన సైన్యం వాటిని ప‌ట్టించు కోవ‌డం లేదు. యుద్ధం అనివార్యం అయ్యేలా చేస్తోంది. ఇది పూర్తిగా ఖండించాల్సిన అవ‌స‌రం.

అత్యంత బాధాక‌రం కూడా. సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మైన చ‌ర్య‌ను(Myanmar Protest) మనంద‌రం నిర‌సించాలి.

లేక పోతే ఇలాంటి శ‌క్తులన్నీ మ‌ళ్లీ ఎక్క‌డో ఒక చోట త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మ‌య‌న్మార్ జుంటా సైన్యం తాము చంప‌లేద‌ని చెబుతోంది.

కానీ మా వ‌ద్ద ఎవ‌రైతే అమాయ‌క పౌరులు ప్రాణాలు కోల్పోయారో వారంద‌రి వివ‌రాలు పూర్తిగా ఉన్నాయ‌ని ర‌వీనా ఇటీవ‌ల జ‌రిగిన యుఎన్ స‌మావేశంలో ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

విచిత్రం ఏమిటంటే మిల‌ట‌రీ బాయినెట్ల కింద న‌లిగి పోయిన వారే 200 మందికి పైగా ఉన్నార‌ని చెప్ప‌డం అత్యంత దారుణం. గ‌తంలో ఏలిన పాల‌కుల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది సైన్యం.

Also Read : అరుదైన అవ‌కాశం నిల‌బెట్టుకునేనా అధికారం

Leave A Reply

Your Email Id will not be published!