IND U19 vs AUS U19 : కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు దంచి కొట్టారు

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు యువ‌భార‌త్

IND U19 vs AUS U19 : ఓ వైపు సీనియ‌ర్ భార‌త క్రికెట‌ర్లు చేతులెత్తేసి వ‌న్డే, టెస్టు సీరీస్ కోల్పోయి తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్న త‌రుణంలో యువ‌ ఆట‌గాళ్లు త‌ల దించుకునేలా అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో అద్భుత‌మైన విజ‌యం సాధించింది.

త‌మ‌కు తిరుగే లేద‌ని చాటారు. వెస్టిండీస్ లోని అంటిగ్వా వేదిక‌గా అండ‌ర్-19 ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లో

అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు(IND U19 vs AUS U19) గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. నూత‌న చ‌రిత్ర‌ను లిఖించింది.

ముచ్చ‌ట‌గా నాలుగోసారి ఆసిస్ పై విజ‌యం సాధించి రికార్డు బ్రేక్ చేసింది యువ భార‌తం.

యువ బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 194 ప‌రుగుల‌కే ఆలౌట్ చేశారు.

దీంతో 291 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసిస్ టీమ్ చేతులెత్తేసింది.

దీంతో సెమీస్ లో ఓడించి టీమిండియా ఫైన‌ల్ కు చేరింది. 96 ప‌రుగుల తేడాతో ఓడించింది.

24 ఏళ్ల అనంత‌రం ఫైన‌ల్ కు చేరుకున్న యువ ఇంగ్లండ్ జ‌ట్టుతో (IND U19 vs AUS U19)త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 290 ప‌రుగులు చేసింది.

ఇక ఆసిస్ జ‌ట్టు 41.5 ఓవ‌ర్ల‌లో 194 ప‌రుగుల‌కే కుప్ప కూలింది.

భార‌త బౌల‌ర్ల‌లో విక్టీ మూడు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. నిషాంత్ సింధు, ర‌వికుమార్ చెరో రెండు వికెట్లు తీశాడు.

తాంబే, ర‌ఘువంశీలు ఒక్కో వికెట్ తీశాడు. ఇక టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ య‌శ్ ధుల్ దుమ్ము రేపాడు.

ఆంధ్రా క్రికెట‌ర్ షేక్ ర‌షీద్ లు క‌లిసి ఆసిస్ కు చుక్క‌లు చూపించారు.

కెప్టెన్ 110 బంతుల్లో 10 ఫోర్ల‌తో 110 ప‌రుగులు చేస్తే ర‌షీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు ఓ సిక్స్ తో 94 ప‌రుగులు చేశాడు.

ఒక్క మూడో వికెట్ కు 204 ర‌న్స్ చేశారు.

టార్గెట్ ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన ఆసిస్ జ‌ట్టు లాచ్ లాన్ షా 51 ప‌రుగులు చేస్తే కోరి మిల్ల‌ర్ 38 , క్యాంప్ బెల్ 30 ప‌రుగులు మాత్ర‌మే చేసి రాణించారు.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరిసిన మిథాలీ రాజ్

Leave A Reply

Your Email Id will not be published!