Yash Dhull : భార‌త క్రికెట్ లో య‌శ్ ధుల్ టార్చ్ బేర‌ర్

య‌శ్ ధుల్ మామూలోడు కాద‌ప్పా

Yash Dhull : ఎవ‌రీ య‌శ్ ధుల్ అనుకుంటున్నారా. అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న య‌శ‌ధుల్ దుమ్ము రేపాడు. త‌న సార‌థ్యంలో వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు టీమిండియాను చేర్చాడు.

సెకండ్ సెమీ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో భారీ ఆధిక్యంతో విజ‌యం సాధించింది.

ఈ గెలుపులో ప్ర‌ధాన పాత్ర య‌శ్ ధుల్ దే(Yash Dhull). బాధ్య‌తాయుత‌మైన నాయ‌కుడిగా ఉంటూ సెంచ‌రీ సాధించాడు.

తాను ఆడ‌డంతో పాటు జ‌ట్టును గెలుపు తీరాల‌కు చేర్చాడు. 110 బంతులు ఎదుర్కొని 114 ప‌రుగులు చేశాడు.

ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. ఉప సార‌ధిగా ఉన్న షేక్ ర‌షీద్ 94 ప‌రుగుల‌తో రాణించాడు. క్రికెట‌ర్ గా స‌త్తా చాటాడు.

ఇక మిగిలింది కొన్ని అడుగులే. క‌ప్ గెలిస్తే య‌ష్ ధుల్ నాయ‌కుడిగా చ‌రిత్ర‌లో నిలిచి పోతాడు.

కెప్టెన్, వైస్ కెప్టెన్ క‌లిసి 204 ప‌రుగుల పార్ట‌న‌ర్ షిప్ నెల‌కొల్పారు.

దీంతో భారీ టార్గెట్ ఆసిస్ ముందు ఉంచడంలో వీరిద్ద‌రూ కీల‌క పాత్ర పోషించారు. య‌శ్ ధుల్ మామూలు ఆట‌గాడు కాదు.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటి చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ ఏరికోరి య‌శ్ ధుల్ (Yash Dhull)కు కెప్టెన్ గా ఎంపిక చేశాడు.

అంత‌కు ముందు ఢిల్లీ అండ‌ర్ -16 టీమ్ తో పాటు ఇండియా -ఎ- అండ‌ర్ -19 టీమ్ ల‌కు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు.

తాజాగా దేశీవాళి క్రికెట‌ర్ టోర్నీ వినూ మ‌న్క‌డ్ ట్రోఫీలో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు య‌శ్ ధుల్.

ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేష‌న్ త‌ర‌పున కేవ‌లం ఐదు మ్యాచులే ఆడిన‌ప్ప‌టికీ భారీ ప‌రుగులు సాధించాడు.

ఆసియా అండ‌ర్ -19 టోర్నీలో టీమిండియా కు నాయ‌కుడిగా ఉండి విజేత‌గా నిలిచేలా చేశాడు య‌ష్ ధుల్.

మ‌రో వైపు ఇంగ్లండ్ ఫ‌స్ట్ సెమీ ఫైన‌ల్ లో అండ‌ర్ 19 ఆఫ్గ‌నిస్తాన్ ను ఓడించింది. 24 ఏళ్ల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఫైన‌ల్ కు చేరింది.

దీంతో య‌శ్ ధుల్ (Yash Dhull)నాయ‌క‌త్వంలోని అండ‌ర్ -19 టీమిండియా ఆసిస్ ను మ‌ట్టి క‌రిపించి ఫైన‌ల్ కు వ‌చ్చింది.

దీంతో ఇరు జ‌ట్లు హోరా హోరీ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇదే క్ర‌మంలో టోర్నీలో భాగంగా య‌శ్ ధుల్ కు క‌రోనా సోకింది. కోలుకున్నాక మ‌ళ్లీ మ్యాచ్ లోకి వ‌చ్చాడు.

త‌న‌ను తాను స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ గా ప్రూవ్ చేసుకున్నాడు.

ఈనెల 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా బీసీసీఐ ఐపీఎల్ వేలం నిర్వ‌హించ‌నుంది.

ఇందులో భాగంగా య‌శ్ ధుల్ కూడా వేలం పాట‌లో పాల్గొన‌నున్నాడు.

ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఆడేందుకు ఇంకా కొన్ని గంట‌లే మిగిలి ఉన్నాయి. మ‌రోసారి య‌శ్ ధుల్ రాణిస్తే భార‌త్ సిగ‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ రావ‌డం ఖాయం.

Also Read : త్రివ‌ర్ణ‌ ప‌తాక‌మా జ‌య‌హో యువ భార‌త‌మా

Leave A Reply

Your Email Id will not be published!