Sourav Ganguly : కరోనా మహమ్మారి ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022ను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
ఇవాళ ఆయన అధికారికంగా ఎక్కడ జరుపుతామో వెల్లడించారు. ఏమైన ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే తప్పా తాము భారత దేశంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. టోర్నీకి సంబంధించిన అన్ని లీగ్ మ్యాచ్ లు ఇక్కడే కొనసాగుతాయని తెలిపాడు దాదా.
కరోనా కేసుల పై ఆ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ మెగా వేలానికి సిద్దం చేసింది. ఇందుకు సంబంధించి 590 మంది ఆటగాళ్ల ఫైనల్ లిస్టును ప్రకటించింది.
బేస్ ప్రైజ్ రూ. 2 కోట్ల నుంచి మొదలు కానుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నిర్వహించిన ఐపీఎల్ టోర్నీలలో 8 జట్లు పాల్గొనేవి. ఈసారి రూ. 1725 కోట్లతో రెండు కొత్త జట్లను బిడ్ ద్వారా ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో భారీ ఆదాయం సమకూరింది ఆ సంస్థకు.
దేశంలో ఈ క్రీడా సంస్థకు ఉన్నంత డబ్బులు ఇంకే సంస్థ వద్ద లేవు. కాగా అహ్మదాబాద్, లక్నో టీంలు కొత్తగా రానున్నాయి.
గతంలో దక్షిణాఫ్రికా, విండీస్, శ్రీలంక దేశాలలో రిచ్ లీగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). ముంబై , పుణెలో మ్యాచ్ లు నిర్వహిస్తాం.
నాకౌట్ దశకు త్వరలోనే ఎక్కడ ఆడతారనేది ప్రకటిస్తామన్నాడు. ఇదిలా ఉండగా
Also Read : కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు దంచి కొట్టారు