BCCI : కరోనా అటు దేశాన్ని ఇటు క్రికెట్ ను వీడడం లేదు. ఇప్పటికే కరోనా దెబ్బకు భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ (BCCI )ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ 2021ను సెకెండ్ సెషన్ ను దుబాయి వేదికగా నిర్వహించింది.
ప్రస్తుతం ఈనెల 12, 13న ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనుంది. ఇదే సమయంలో ఈ ఏడాది భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహిస్తామని ప్రకటించారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. ఒక వేళ పరిస్థితులు శృతి మించితే తటస్థ వేదికలలో నిర్వహించే ఆలోచన చేస్తామన్నారు.
ఇక ఈనెల 6న స్వదేశంలో వెస్టిండీస్ తో వన్డే, టీ20 మ్యాచ్ సీరీస్ లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భారత జట్లను ఖరారు చేసింది బీసీసీఐ(BCCI )సెలక్షన్ కమిటీ. అయితే టీమిండియాలో 8 మంది ఆటగాళ్లకు కరోనా సోకింది.
దీంతో ప్రాక్టీస్ సెషన్ కు దూరమయ్యారు..శిఖర్ ధవన్ , రుతురాజ్ , శ్రేయాస్ అయ్యర్, నవ దీప్ సైనీ ఉన్నారు. దీంతో ఓపెనర్లు ఎవరు ఉండాలనే దానిపై మరోసారి చర్చించింది బీసీసీఐ.
మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్ ను స్టాండ్ బైగా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. వ్యక్తిగత కారణాల రీత్యా ఓపెనర్ కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.
అతడి ప్లేస్ లో ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. కిషన్ శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్ లో పాల్గొన్నాడు. ఓపెనింగ్ చేసిన అనుభవం ఉండడంతో అతడిని ఎంపిక చేసింది బీసీసీఐ.
వీరు కూడా కరోనా బారిన పడితే ఇతర ఆటగాళ్లను పరిగణలోకి తీసుకునే చాన్స్ ఉంది.
Also Read : ఎంతో నేర్చుకున్నా వారికి రుణపడి ఉన్నా