Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రచారంపై స్పందించాడు.
క్రికెటర్ గా , బాధ్యతాయుతమైన స్కిప్పర్ గా ఈ దేశానికి సేవలు అందొంచా. నా క్యారెక్టర్ ఏమిటో ఈ దేశానికి తెలుసు. కచ్చితత్వానికి, నీతి నిజాయితీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తా.
బీసీసీఐ బాస్ గా నా పరిమితులు ఏంటో పరిధులు ఏంటో రూల్స్ ఏమిటో బాగా తెలుసున్నాడు దాదా. ఇటీవల బీసీసీఐ రూల్స్ కు విరుద్దంగా తాను సెలక్షన్ కమిటీ మీటింగ్ కు హాజరైనట్లు ఓ ఫోటో షేర్ చేస్తూ విమర్శలకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ సందర్భంగా ఏదైనా రాసేటప్పుడు ముందూ వెనుకా ఆలోచించుకుని రాయాలని సూచించాడు. బీసీసీఐ లాంటి పెద్ద సంస్థకు తాను చీఫ్ గా ఉన్నప్పుడు నేను తీసుకునే ఏ నిర్ణయమైనా అది దేశ క్రికెట్ ను ప్రభావితం చేస్తుందని తనకు తెలుసని స్పష్టం చేశాడు.
ఒక రకంగా ఈ పోస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కోట్లాది కళ్లు ప్రతి కదలికలను గమనిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రూల్స్ ను ఎలా అతిక్రమిస్తానని అనుకుంటారని ఎదురు ప్రశ్న వేశాడు గంగూలీ(Sourav Ganguly).
తప్పుడు విమర్శలు, పిచ్చి ఆరోపణలను తాను పట్టించు కోనని కుండ బద్దలు కొట్టాడు ఈ బెంగాల్ టైగర్.
Also Read : కరోనా కలకలంతో బీసీసీఐ పరేషాన్