Lata Mangeshkar : విష‌మంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం

వెంటిలేట‌ర్ పై గాయ‌నికి చికిత్స

Lata Mangeshkar : భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని ముంబై లోని బ్రీక్ క్యాండీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ ప్ర‌తీత్ సంధాని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ల‌తా మంగేష్క‌ర్ (Lata Mangeshkar)కు 92 ఏళ్లు. ఇటీవ‌ల ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింది. గ‌త నెల జ‌న‌వ‌రి 11న బ్రీచ్ క్యాండీలో చేర్చారు.

అంతే కాకుండా కోవిడ్ తో పాటు ల‌తా మంగేష్క‌ర్ కు న్యూమోనియో కూడా సోకింది. ఇదిలా ఉండ‌గా కోవిడ్ ను జ‌యించిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తెలిపారు.

న్యూమోనియా నుంచి కూడా కోలుకున్న‌ట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యంపై వ‌దంతులు, పుకార్లు నమ్మ‌వ‌ద్ద‌ని ఆమె కుటుంబీకులు తెలిపారు.

ఈ త‌రుణంలో ప్ర‌శాంతంగా ఉంద‌న్న స‌మ‌యంలో మ‌రోసారి ల‌తాజీ ఆరోగ్యం కుద‌ట‌క పడ‌క పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప్ర‌త్యేకించి ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేస్తామ‌ని సాక్షాత్తు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవాల‌ని తామంతా కోరుతున్నామ‌ని, కోట్లాది అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నార‌ని తెలిపింది మ‌రాఠా స‌ర్కార్.

ఇదిలా ఉండ‌గా దేశంలో అత్య‌ధిక భాష‌ల్లో పాట‌లు పాడారు. అద్భుత‌మైన గాయ‌నిగా పేరొందారు. ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు ఆమెను వ‌రించాయి.

ఆనాటి నెహ్రూ నుంచి నేటి భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దాకా ల‌తాజీ (Lata Mangeshkar)అంటే ఎన‌లేని అభిమానం అంత‌కంటే గౌర‌వం కూడా. ఎందుకంటే ఆమె దేశం గ‌ర్వించ‌త‌గిన గాన కోకిల‌.

Also Read : సినిమాలకు రాహుల్ రామ‌కృష్ణ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!