Narendra singh Tomar : రైతులు తాము పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్(Narendra singh Tomar).
ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు విధించడం వల్ల కమిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. గోవా, ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ , మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగించింది.
కాగా ఎన్నికలు పూర్తయ్యాక ఎంఎస్పీ పై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు నరేంద్ర సింగ్ తోమర్(Narendra singh Tomar). ఈ విషయం గురించి తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామన్నారు.
ఎన్నికలయ్యాకనే కమిటీని ఏర్పాటు చేయమని స్పష్టం చేసిందన్నారు. అందుకే కమిటీ ఏర్పాటులో ఆలస్యమైందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
రైతు సంఘాలతో పాటు వ్యవసాయ రంగ నిపుణులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారితో సమావేశమై సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు.
కాగా ఎంఎస్పీపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ఎంపీ రవీంద్ర కుమార్ ప్రశ్నించారు లోక్ సభలో. దీనికి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చారు.
రైతులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
పీఎం కిసాన్ , మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశామన్నారు తోమర్.
Also Read : పంటల నాణ్యత తనిఖీ సులభతరం