T20 WC 2022 : ఇది ఊహించని సన్నివేశం. ఆస్ట్రేలియా వేదికగా జరిగే వరల్డ్ కప్ లో దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు సంబంధించి నిమిషాల లోపే టికెట్లన్నీ అయి పోవడం విశేషం.
ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్(T20 WC 2022) ఈ ఏడాదిలో నిర్వహించేందుకు రెడీ అయ్యింది క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు. ఫస్ట్ మ్యాచ్ భారత్ , పాకిస్తాన్ మధ్య మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది.
జనరల్ టికెట్ల కోసం జారీ చేసిన ఐదు నిమిషాల లోపే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోరంగా ఓడి పోయింది.
ఈ ఏడాది అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 27న సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఇండియా గ్రూప్ -ఏలో ఉంది.
ఈ ఏడాది చివర్లో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగుతున్న 45 మ్యాచ్ లలో ప్రీ సేల్ పరిధిలో ఏకంగా 2, 00, 000 టికెట్లు అమ్ముడు పోయాయి.
ప్రపంచ క్రికెట్ లో ఇది ఓ రికార్డ్ అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర జట్లతో మ్యాచ్ ల కంటే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కు ఎక్కవ డిమాండ్ ఉంటోంది.
కరోనా కారణంగా గతంలో జరిగిన మ్యాచ్ లకు ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. కానీ ఈసారి వాటిపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి వేసింది.
దీంతో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఇది ఊహించని రీతిలో స్పందన ఉందన్నారు టీ20 వరల్డ్ కప్ (T20 WC 2022)లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ సిఇఓ మిచెల్ ఎన్ రైట్.
Also Read : మీ విజయం యువతకు ఆదర్శం