Australia Squad : సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ లో పర్యటించనుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. 25 ఏళ్ల అనంతరం ఆసిస్ టీమ్ ఆడనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
పాకిస్తాన్ లో భద్రతా కారణాల రీత్యా ఇన్నేళ్ల పాటు ఆడేందుకు వెళ్లలేదు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిఇఓ,
చైర్మన్ రమీజ్ రజా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు చీఫ్ తో మాట్లాడడంతో ఇరు జట్లు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
చివరకు పాక్ లో ఆడేందుకు సమ్మతించింది. రెండు దశాబ్దాల అనంతరం వచ్చే నెలలో పాకిస్తాన్ కు వెళ్లనుంది.
ఈ టూర్ లో భాగంగా ఆస్ట్రేలియా పాకిస్తాన్ (Australia Squad)తో 3 టెస్టులు , 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది.
ఇదిలా ఉండగా ఇవాళ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తమ టీమ్ ను ప్రకటించింది.
సుదీర్ఘ కాలం పాటు హెడ్ కోచ్ గా ఉన్న లాంగర్ ను వద్దనుకుంది ఆసిస్ బోర్డు.
ఇక తీవ్ర గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరిగిన యాషెష్ సీరీస్ మధ్య లోనే తప్పుకున్న జోష్ హేజిల్ వుడ్ ఇప్పుడు మళ్లీ పాక్ టూర్ లో టీమ్ లో చేరాడు.
ఆసిస్ కెప్టెన్ గా పాట్ కమిన్స్ ను నియమించింది ఆస్ట్రేలియా బోర్డు. ఇక కమిన్స్ సారథ్యంలో అద్భుతమైన విజయం నమోదు చేసింది ఆసిస్. ఇంగ్లండ్ కు చుక్కలు చూపింది.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా టీమ్ ఇలా ఉంది. కమిన్స్ కెప్టెన్ కాగా స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్ గా ఉండగా అగర్ , స్కాట్ బోలాండ్ , అలెక్స్ కారీ, కెమరాన్ గ్రీన్ , మార్కస్ హారిస్ , జోష్ హాజిల్ వుడ్ , ట్రావిస్ హెడ్ , జోష్ ఇంగ్లీస్ ఉన్నారు.
వీరితో పాటు ఉస్మాన్ ఖవాజా, లాబుషేన్ , నాథన్ లియోన్ , మార్ష్ , మిచెల్ స్టార్క్ , మిచెల్ , డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
Also Read : ఐదు నిమిషాల్లోపే టికెట్లు క్లోజ్