BCCI PCB : పీసీబీ ప్ర‌తిపాద‌న బీసీసీఐ తిర‌స్క‌ర‌ణ

నాలుగు దేశాల టీ20 సీరీస్ క‌ష్టం

BCCI PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీస‌సీఐ. పీసీబీ సిఇఓ, చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా అరుదైన ప్ర‌తిపాద‌న తీసుకు వ‌చ్చాడు బీసీసీఐ ముందుకు.

ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల‌తో క‌లిపి టీ20 సీరీస్ ను తీసుకు రావాల‌ని సూచించాడు. ర‌మీజ్ ర‌జా చేసిన ప్ర‌తిపాద‌న వ‌ల్ల ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని బీసీసీఐ(BCCI PCB) స్ప‌ష్టం చేసింది.

ఈ లీగ్ వ‌ల్ల అసలైన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని పేర్కొంది. స్వ‌ల్ప‌కాలిక టోర్నీ నిర్వ‌హించ‌డం వ‌ల్ల క‌మ‌ర్షియ‌ల్ గా ఆదాయం రావ‌చ్చేమో కానీ ఆట‌కు ఎలాంటి ఉప‌యోగం రాద‌ని స్ప‌ష్టం చేసింది బీసీసీఐ.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే బీసీసీఐకి ఊపిరి పీల్చుకోలేని రీతిలో సీరీస్ లు, ఈవెంట్లు, లీగ్ లు ఉన్నాయ‌ని దీంతో స‌మ‌యం ఉండ‌ద‌ని పేర్కొంది.

ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ఉండాల‌ని కోరుతున్నామ‌ని ఈ త‌రుణంలో నాలుగు దేశాల‌తో టోర్నీ నిర్వ‌హించ‌డం అసాధ్య‌మ‌ని సున్నితంగా పీసీబీ చీఫ్ ప్ర‌తిపాద‌న‌న‌ను తిర‌స్క‌రించింది బీసీసీఐ.

దీంతో భార‌త‌, పాకిస్తాన్ జ‌ట్లతో కూడిన టీ20 సీరీస్ ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని భావించ‌క త‌ప్ప‌దు. గ‌త ఏడాది యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను దృష్టిలో పెట్టుకుని ర‌మీజ్ ర‌జా ఈ ప్ర‌తిపాద‌న బీసీసీఐ(BCCI PCB) ముందుకు తీసుకు వ‌చ్చాడు.

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా వేదిక‌గా ఈ ఏడాది అక్టోబ‌ర్ లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించ‌నుంది. ఈ సంద‌ర్భంగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కు ప్రారంభించిన 5 నిమిషాల్లో లోపే 2, 00, 000 ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడు పోవ‌డం విశేషం.

Also Read : కోహ్లీ ఆట తీరుపై స‌న్నీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!