IPL 2022 : కోట్లు ప‌లికిన స్టార్ ప్లేయ‌ర్లు

ఐపీఎల్ మెగా వేలంపై ఉత్కంఠ

IPL 2022 : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ మెగా ఐపీఎల్(IPL 2022) వేలానికి సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈనెల 12, 13 తేదీలలో వేలం పాట నిర్విహించ‌నుంది.

మొత్తం ఈ మెగా వేలానికి 1124 ద‌ర‌ఖాస్తులు రాగా అందులో 590 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. భారీ ఎత్తున క‌రోడ్ ప‌తులు కాబోతున్నారు ఆట‌గాళ్లు.

ప్ర‌ధానంగా మొత్తం ఈ వేలం పాట‌లో ఐదుగురు ప్లేయ‌ర్ల‌కు కోట్ల పంట పండ‌నుంది. నిన్న మొన్న‌టి దాకా డ‌బ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న క్రికెట‌ర్లు ఒక్క రోజులో కోట్ల‌కు అధిప‌తులు కాబోతున్నారు.

గ‌త ఏడాది అత్యంత ఖ‌రీదైన ప్లేయర్ల‌లో న‌లుగురు విదేశీ ఆట‌గాళ్లు ఉంటే భార‌త్ కు చెందిన ఒకే ఒక్క ఆట‌గాడు టాప్ లో నిలిచాడు. ఇందులో ఆస్ట్రేలియా నుంచి ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఉంటే న్యూజిలాండ్, ద‌క్షిణాఫ్రికా, ఇండియా నుంచి ఒక్క‌రొక్క‌రు ఎంపిక‌య్యారు.

స‌ఫారీ ఆల్ రౌండ‌ర్ క్రిస్ మోరిస్ పై ఫ్రాంచైజీ ఎక్కువ ధ‌ర‌కు పాడింది. కీవీస్ ఆల్ రౌండ‌ర్ కైల్ జేమ‌స్న్, ఆసిస్ ప్లేయ‌ర్ రిచ‌ర్డ్ స‌న్ , గ్లెన్ మాక్స్ వెల్ ఉన్నారు.

ఇక భార‌త్ కు చెందిన కృష్ణ‌ప్ప గౌతం అత్యంత అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ గా చరిత్ర సృష్టించాడు. క్రిస్ మోరిస్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఏకంగా 16.25 కోట్ల‌కు తీసుకుంది.

జేమ్స‌న్ ఆర్సీబీ 15 కోట్ల‌కు తీసుకుంటే మ్యాక్స్ వెల్ ను 14.25 కోట్ల‌కు చేజిక్కించుకుంది. రిచ‌ర్డ్ స‌న్ ను పంజాబ్ కింగ్స్ 14 కోట్ల‌కు తీసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ కృష్ణ‌ప్ప గౌత‌మ్ ను 9.25 కోట్ల‌కు చేజిక్కించుకుంది.

Also Read : ఐదు నిమిషాల్లోపే టికెట్లు క్లోజ్

Leave A Reply

Your Email Id will not be published!