Rahane Pujara : సీన్ రివర్స్ అయ్యింది. నిన్నటి దాకా వారిద్దరూ భారత క్రికెట్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కానీ ప్రస్తుతం ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారెవరో కాదు ఇప్పటికే పేరొందిన అజింక్యా రహానే ,చతేశ్వర్ పుజారా. సౌతాఫ్రికా టూర్ లో పరుగులు చేయలేక నానా తంటాలు పడ్డారు.
ఈ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వారిద్దరూ గొప్ప క్రికెటర్లు అంటూనే తీవ్ర హెచ్చరిక చేశాడు.
అదేమిటంటే ఆడక పోతే తుది జట్టులో సీటు దొరకడం కష్టమేనంటూ స్పష్టం చేశాడు. తాను కూడా ఫామ్ కోల్పోయానని, ఆ సమయంలో ఊరుకోలేదని దేశీవాళీ టోర్నీలలో ఆడానని, మళ్లీ ఫామ్ లోకి వచ్చానని చెప్పాడు.
దీంతో అజింక్యా రహానే, పుజారాలకు(Rahane Pujara) హింట్ ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాజాగా జరగబోయే రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నారు.
విచిత్రం ఏమిటంటే కొన్నేళ్లుగా ఒకే జట్టులో సహచరులుగా ఉన్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడారు. ఎన్నో విజయాలలో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం నిన్నటి దాకా కలిసి ఆడిన రహానే, పుజారాలు ఇప్పుడు రంజీ ట్రోఫీలో రెండు జట్ల మధ్య బరిలో నిలవనున్నారు. రంజీ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో తలపడనుంది.
ఈ మ్యాచ్ ఈనెల 17న స్టార్ట్ అవుతుంది. వీరిద్దరూ ప్రత్యర్థులు కావడం విశేషం కదూ. ఇక భారత జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న పుజారా సౌరాష్ట్ర నుంచి ఆడుతుంటే రహానే ముంబై నుంచి ఆడనున్నారు.
Also Read : కోహ్లీ ఆట తీరుపై సన్నీ కామెంట్స్