IND VS WI 2nd ODI : వెస్టిండీస్ పై రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సీరస్ ను 2-0 ఆధికత్యం గెలుచుకుంది. సఫారీ తో వన్డే, టెస్టు సీరీస్ కోల్పోయిన అనంతరం లభించిన విజయం ఇది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాటర్ లు చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ప్రధానంగా ప్రసిద్ద కృష్ణ బౌలింగ్ దెబ్బకు కుప్ప కూలింది విండీస్ టీం.
తొమ్మిది ఓవర్లు వేసిన కృష్ణ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. భారత జట్టు విజయ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వెస్టిండీస్ దెబ్బకు 193 పరుగులకే చాప చుట్టేసింది.
44 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా దీపక్ హూడా, సిరాజ్ , వాషింగ్టన్ సుందర్, చాహర్(IND VS WI 2nd ODI) చెరో వికెట్ తీశారు. భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
అంతకు ముందు భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎప్పటి లాగే కోహ్లీ నిరాశ పరిచాడు.
కేఎల్ రాహుల్ 49 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కీరన్ పొలార్డ్ ఇవాళ ఆడక పోవడంతో నికోలస్ పూరన్ నాయకత్వం వహించాడు వెస్టిండీస్ జట్టుకు.
ఇదిలా ఉండగా ఈనెల 11న అహ్మదాబాద్ లో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తోంది.
Also Read : కోట్లు పలికిన స్టార్ ప్లేయర్లు