RBI Governor : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎప్పటి లాగే రెపో రేటును యథావిధిగా ఉంచింది. మరో వైపు నిన్నటి దాకా క్రిప్టో కరెన్సీ పై చిలుక పలకులు పలికిన కేంద్రానికి వంత పాడే విధంగా డిజిటల్ రూపీకి ఊతం ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.
దానిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చంటూ ప్రకటించింది. ఇప్పటి దాకా డిజిటల్ రూపీపై ఉన్న పరిమితిని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని స్పష్టం చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor ). ఇదిలా ఉండగా ఆర్బీఐ 14వ బోర్డు సమావేశం జరిగింది.
బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం రిపోరేటు 4 శాతంగా ఉందన్నారు. నిత్యావసర వస్తువులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ ధరలు అదుపులోనే ఉంటాయని ఎక్కడా పెరగవన్నాడు. అంతే కాకుండా గతంలో కంటే ఈసారి పప్పులు, వంట నూనె ఉత్పత్తులు గణనీయంగా పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు శక్తికాంత దాస్(RBI Governor ).
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెంచడం లేదని గుర్తు చేశారు. ఇది కూడా ఒకందుకు మంచిదేనని తెలిపారు. కరోనా ప్రభావం ఏమంత లేదన్నారు.
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతా బాగుందన్న సంకేతం ఇచ్చారు శక్తికాంత దాస్. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారతీయ రూపాయికి ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చారు.
Also Read : తగ్గేదే లేదంటున్న అష్నీర్ గ్రోవర్