Ratan Tata : వ్యక్తిత్వంలో ధనవంతుడు కోట్లల్లో సామాన్యుడు
ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా
Ratan Tata : చిటికేస్తే కోట్లు. లెక్కనేంత ఆస్తులు. ప్రపంచం గర్వించ దగిన ధనవంతుల్లో ఆయన ఒకరు. ప్రసిద్ది చెందిన వ్యాపారవేత్తలలో టాప్ లో ఉంటారు. అతడే రతన్ టాటా.
తాము తయారు చేసే ఏదైనా సరే అది భారతీయతను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఆయనతో పాటు మరో వ్యాపారవేత్త కూడా ఉన్నారు.
ఆయనే మహీంద్ర గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.
రతన్ టాటా కోరిక ఒక్కటే ప్రతి సామాన్యుడు కూడా కారులో ప్రయాణం చేయాలని.
సదరు సంస్థ నుంచి ఎన్నో వాహనాలు తీసుకు వచ్చింది. కానీ ఎందుకనో నానో కారు సక్సెస్ కాలేక పోయింది.
కోల్ కతాలో కోట్లు విలువ చేసే భూముల్ని తిరిగి రైతులకే తిరిగి ఇచ్చేసిన ఘనత టాటాది(Ratan Tata).
ఇక వరల్డ్ వైడ్ గా టాప్ లో ఉన్న వెహికిల్స్ ఆయన వద్ద కొలువు తీరి ఉన్నాయి.
కానీ ఆయన హృదయం మాత్రం సామాన్యుడు ప్రయాణం చేసే నానో కారు పైనే ఉందంటే నమ్మగలమా. ప్రసిద్ద సామాజిక దిగ్గజం లింక్డ్ ఇన్ లో టాటా(Ratan Tata) తాను ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేశారు.
ఈ విషయాన్ని తన సహాయకుడు శాంతను నాయుడు వెల్లడించారు. రతన్ టాటా ఎక్కడికి వెళ్లినా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడతారు.
ఇప్పటి దాకా ఎందుకు సక్సెస్ కాలేదన్న తనను తొలిచి వేస్తూ వచ్చింది నానో విషయంలో. కామన్ మ్యాన్ కు మేలు చేకూర్చేలా, ఆ ఫ్యామిలీ అంతా ప్రయాణం చేసేలా డిజైన్ చేశారు.
తాజాగా కేవలం రతన్ టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్ కారును తయారు చేసింది టాటా ఎలెక్ట్రా సంస్థ. ఆయన కోరిక మేరకు కారును అందజేసింది.
రతన్ టాటా ఈ కారులో ప్రయాణం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే విద్యుత్ నానో కారు తీసుకు రావాలని టాటా సంకల్పంతో ఉన్నారు. 84 ఏళ్ల వయసులో ఉన్న టాటాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
Also Read : ‘సమతాకేంద్రం’ విశేషాల సమాహారం