IPL Auction 2022 : రూ. 5 కోట్లు ప‌లికిన ర‌విచంద్ర‌న్ అశ్విన్

చేజిక్కించుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

IPL Auction 2022   : బెంగ‌ళూరు వేదిక‌గా ప్రారంభ‌మైన మెగా ఐపీఎల్ 2022 వేలం(IPL Auction 2022 )పాట‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రూ. 20 కోట్ల‌కు పైగానే అమ్ముడు పోతాడ‌ని అనుకున్న శ్రేయాస్ అయ్య‌ర్ త‌క్కువ ధ‌ర ప‌ల‌క‌డం విశేషం.

ఇక వార్న‌ర్ భ‌య్యాను ఢిల్లీ క్యాపిట‌ల్స్ తీసుకుంది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను ద‌క్కించు కునేందుకు అన్ని ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 5 కోట్ల‌కు అశ్విన్ ను ద‌క్కించుకుంది.

అశ్విన్ ఈసారి రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర‌కు వ‌చ్చాడు. గ‌త ఐపీఎల్ 2021 సీజ‌న్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. శిఖ‌ర్ ధావ‌న్ ను పంజాబ్ తీసుకుంటే అశ్విన్ విష‌యంలో కొంత పోటీ ఉన్న‌ప్ప‌టికీ ఆర్ఆర్ ఫోక‌స్ చేసింది తీసుకుంది.

పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ధావ‌న్ వెళ్లాడు. ఫ‌స్ట్ పేరు అత‌డిదే వ‌చ్చింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ,పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ప‌డింది. చివ‌ర‌కు పంజాబ్ స్టార్ ప్లేయ‌ర్ ను తీసుకుంది.

త‌న ప్రాథ‌మిక ధ‌ర రూ. 2 కోట్లు గా ముందుకు వ‌చ్చాడు శిఖ‌ర్ ధావ‌న్. ప్రీమియ‌ర్ లీగ్ లో(IPL Auction 2022 )ధావ‌న్ పంజాబ్ జెర్సీని ధ‌రించ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. భార‌త్ ఓపెన‌ర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడాడు.

2018లో తిరిగి పున‌రుద్ద‌రించ బ‌డిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు వ‌చ్చాడు. ఇక వెట‌ర‌న్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తీసుకుంది. అత‌డు జోస్ బ‌ట్ల‌ర్ తో క‌లిసి ఆడ‌నున్నాడు.

ఇక అశ్విన్ ఆడుతున్న‌ది నాల్గోఫ్రాంచైజీ కావ‌డం విశేషం. ర‌విచంద్ర‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడాడు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడ‌తాడు.

Also Read : 12న కీవీస్ భార‌త్ వ‌న్డే మ్యాచ్

Leave A Reply

Your Email Id will not be published!