IPL Auction 2022 : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 వేలం (IPL Auction 2022)పాట రెండో రోజు బెంగళూరు వేదికగా ప్రారంభమైంది. మొదటి రోజు 97 మంది ప్లేయర్లు వేలం పాటలోకి వచ్చారు.
భారీ ఎత్తున ధర పలికింది మాత్రం ఇషాన్ కిషన్. అతడిని ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్(IPL Auction 2022) తీసుకుంది. మొదట్లోనే నలుగురు స్టార్లను రాజస్తాన్ రాయల్స్ తీసుకుంది.
ఇక ఆయా జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీలలో ఎన్ని కోట్లు ఉన్నాయనే దాని గురించి తెలుసు కోవాలని అందరికీ ఉంటుంది. ఇక వివరాలలోకి వెళితే. రెండో రోజు మాత్రమే నిర్వహిస్తారు.
మొత్తం 1214 మంది ప్రపంచానికి చెందిన స్టార్ ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులైన వారిని భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ 590 మందిని ఎంపిక చేసింది.
ఇందులో భాగంగా మొదటి రోజు 97 మందిని పరిగణలోకి తీసుకుంది. చాలా మంది స్టార్లను ఆయా ఫ్రాంచైజీలు పట్టించు కోలేదు. ఇక ఫ్రాంచైజీల వద్ద చూస్తే పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 28. 65 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 27.85 కోట్లు ఉన్నాయి.
ఇక ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్కే వద్ద రూ. 20.45 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 20.15 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 18.85 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 18.85 కోట్లు ఉన్నాయి.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 12.65 కోట్లు , రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 12.15 కోట్లు, ఆర్సీబీ వద్ద రూ. 9.25 కోట్లు , లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ. 6.9 కోట్లు ఉన్నాయి.
Also Read : ఆదిల్ రషీద్ పై మైఖేల్ వాన్ కామెంట్