IPL Auction 2022 : యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం(IPL Auction 2022 )రెండో రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇటీవల ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న అజింక్యా రహానేను అనూహ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ. కోటి రూపాయలకు తీసుకుంది. ఒక రకంగా అతడి స్థాయికి ఈ ధర చాలా తక్కువే.
ఇక చతేశ్వర్ పుజారా వైపు ఎవరూ ఫోకస్ పెట్టలేదు. అన్ని ఫ్రాంచైజీలు ఈసారి స్టార్ ప్లేయర్లను పక్కన పెట్టేశాయి. ఇక సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సిఇఓ కావ్య మారన్ తనదైన శైలితో దూసుకు పోతోంది.
ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. వేలం పాట నిర్వాహకుడిగా చారు శర్మను తీసుకు వచ్చింది బీసీసీఐ. ఇవాళ ప్రారంభమైన వెంటనే అనుకోకుండా ఎస్ఆర్ హెచ్ ఫ్రాంచైజీ తొలి సెట్ లో సఫారీ క్రికెటర్ ఎయిడెన్ మార్కరమ్ ను తీసుకుంది.
అతడికి రూ. 2.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరో భారత ప్లేయర్ మన్ దీప్ సింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కోటి 10 లక్షలకు తీసుకుంది. కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్న మోర్గాన్ ను పట్టించు కోలేదు.
ఆసిస్ సారథి ఆరోన్ ఫించ్ (IPL Auction 2022 )సహా పలువురు ఆటగాళ్లు మిగిలి పోయారు. ఫ్రాంచైజీలు వారి పెరెత్తినా అటు వైపు చూడలేదు.
తొలి సెట్ పరంగా చూస్తే అన్ సోల్డ్ ( కొనుగోలు చేయని వారు ) లిస్టు పరంగా చూస్తే డేవిడ్ మలన్, మార్నస్ లబుషన్ , ఇయాన్ , సౌరభ్ తివారీ, ఆరోన్ ఫించ్ , ఛతేశ్వర్ పుజారా ఉన్నారు.
Also Read : షారుఖ్ ఖాన్ ..త్రిపాఠి పంట పండింది