IPL Auction 2022 : బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో(IPL Auction 2022) ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టిమ్ డేవిడ్ , రొమారియో షెపర్డ్ లు భారీ ధరకు అమ్ముడు పోయారు.
అండర్ 19 వరల్డ్ కప్ లో సత్తా చాటిన రాజ్ బావా, రాజ్ వర్దన్ హంగర్గేకర్ పంట పండింది. ఈ ఇద్దరు ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దక్కించుకుంది.
లియామ్ లివింగ్ స్టోన్ , ఓడియన్ స్మిత్ లు భారీ ధర జాబితాలో ఉన్నారు. టిమ్ డేవిడ్ ను రూ. 8. 25 కోట్లకు ముంబై ఇండియన్స దక్కించు కోగా రొమారియా షెపర్డ్ ను సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ రూ. 7. 75 కోట్లకు తీసుకుంది.
ఇంగ్లండ్ ఆటగాడు ఆర్చర్ కోసం ఇవాళ రూ. 8 కోట్లకు దక్కించుకుంది. రాజ్ అంగద్ బావాను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ. 2 కోట్లకు తీసుకుంది. హంగర్గేకర్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. కోటన్నరకు తీసుకుంది.
ఇక శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్ తో పాటు చేతన్ సకారియా పంట పండింది ఈ సారి వేలంలో. లియామ్ లివింగ్ స్టోన్ ను పంజాబ్ కింగ్స్ రూ. 11.5 కోట్లకు కొనుగోలు చేయగా విండీస్ ఆల్ రౌండర్ స్మిత్ రూ. 6 కోట్లకు చేజిక్కించుకుంది.
రెండో రోజు మొదటి ప్లేయర్ గా వేలం పాటకు వచ్చిన ఐడెన్ మార్క్రామ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 2. 6 కోట్లకు తీసుకుంది.
ఇక గత ఐపీఎల్ సీజన్ లలో మెరిసిన ఇషాంత్ శర్మ, మోర్గాన్ , లాబుస్ చాగ్నే, ఆరోన్ ఫించ్ లకు తీవ్ర నిరాశ మిగిలింది. ఈసారి ఫ్రాంచైజీలు వీరి వైపు కన్నెత్తి చూడక పోవడంతో క్రీడాభిమానులు విస్తు పోయారు.
Also Read : ఏయే ఫ్రాంచైజీల వద్ద ఎన్నెన్ని కోట్లు