Tilak Varma IPL : బెంగళూరు వేదికగా ఇవాళ జరిగిన రెండో ఐపీఎల్ లో అన్ క్యాప్ డ్ ప్లేయర్ల పంట పండింది. ఇప్పటికే అండర్ -19 టీం కెప్టెన్ యశ్ ధుల్ కు రూ.50 లక్షలకు అమ్ముడు పోయాడు.
తాజాగా హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ ఊహించని ధరకు తీసుకుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2020లో ఆడిన తిలక్ వర్మపై(Tilak Varma IPL) ఫోకస్ పెట్టడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఏకంగా 1.70 కోట్లకు దక్కించుకుంది. ఎడమ చేతి వాటం బ్యాటర గా ఉన్నాడు. కుడి చేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ గా ఉన్నాడు. ప్రస్తుతం భారత దేశీవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు తిలక్ వర్మ.
తిలక్ వర్మ పూర్తి పేరు నంబూద్రి ఠాకూర్ తిలక్ వర్మ. 2002 నవంబర్ 8న తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టాడు. 2018-19 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.
అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2019 ఫిబ్రవరి 28న టీ20 ఆడాడు. 28 సెప్టెంబర్ లిస్ట్ – ఏ అరంగేట్రం చేశాడు. అంతే కాకుండా 2019, 2019-20 సంవత్సరానికి జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు తిలక్ వర్మ(Tilak Varma IPL).
ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడాడు. ఏపీపై 39 రన్స్ చేశాడు. 784 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు. అత్యధిక స్కోర్ 156 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 50 ఓవర్ల మ్యాచ్ లలో 3 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలు చేశాడు.
సగటు రేటు 52.26 శాతంగా ఉంది. ఇప్పటి దాకా 15 టీ20 మ్యాచ్ లలో తిలక్ వర్మ 381 రన్స్ చేశాడు. ఇందులో 75 పరుగులు ఉన్నాయి. 28 ఫోర్లు 17 సిక్సర్లు కొట్టాడు. 2021లో హైదరాబాద్ తరపున ఢిల్లీపై 139 రన్స్ చేశాడు.
Also Read : ఐపీఎల్ లో నిన్న హీరోలు నేడు జీరోలు