IPL Auction List : రూ. 551 కోట్లు 204 క్రికెట‌ర్లు ఎంపిక‌

ముగిసిన మెగా ఐపీఎల్ వేలం

IPL Auction List : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా ఐపీఎల్ వేలం ముగిసింది.  ఈ వేలం కోసం మొత్తం 590 మందిని ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇందుకు గాను మొద‌టి రోజు 74 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.ఇక రెండో రోజు 130 మంది ప్లేయ‌ర్ల‌ను టేకోవ‌ర్ చేశాయి. మొత్తం 204 మంది ఆట‌గాళ్లు అమ్ముడు పోయారు.

మొత్తం రూ. 551 కోట్లు ఖ‌ర్చు చేశాయి. ఇందులో ప‌ది ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. 19 గంట‌ల పాటు ఈ వేలం పాట కొన‌సాగింది. ఈ 204 మందిలో 67 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు.

రెండో రోజు ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ లివింగ్ స్టోన్ ను పంజాబ్ కింగ్స్ రూ. 11. 5 కోట్ల‌కు ద‌క్కించుకుంది. జోఫ్రా ఆర్చ‌ర్ ను ముంబై ఇండియ‌న్స్ రూ. 8 కోట్లు పెట్టి కొంది.

ప్ర‌పంచ క‌ప్ అండ‌ర్ -19 జ‌ట్టు లో ఆడిన ముగ్గురికి ఈ సారి వేలం పాట‌లో చాన్స్ ల‌భించింది. శిఖ‌ర్ ధావ‌న్ రూ. 8.25 కోట్లు, అశ్విన్ రూ. 5 కోట్లు, ర‌బాడా రూ. 9.25 కోట్లకు అమ్ముడు పోయాడు.

బౌల్ట్ రూ. 8 కోట్లు, అయ్య‌ర్ రూ. 12.25 కోట్లు , ష‌మీ రూ. 6.25 కోట్లు, డుప్లెసిస్ రూ. 6.75 కోట్లు, హెట్మెయిర్ రూ. 8.50 కోట్ల‌కు(IPL Auction List) చేజిక్కించుకున్నాయి.

ఊత‌ప్ప రూ. 2 కోట్లు, జేస‌న్ రాయ్ రూ. రూ. 2 కోట్లు, ప‌డిక్క‌ల్ రూ. 7.75 కోట్లు, బ్రావో రూ. 4.40 కోట్లు, నితీష్ రాణా రూ. 8 కోట్లు, జాస‌న్ హోల్డ‌ర్ రూ. 8.75 కోట్ల‌కు అమ్ముడు పోయారు.

హ‌ర్ష‌ల్ ప‌టేల్ రూ. 10.75 కోట్లు, దీప‌క్ హూడా రూ. 5.75 కోట్లు, హ‌స‌రంగా రూ. 10.75 కోట్లు, పాండ్యా రూ. 8.25 కోట్ల ధ‌ర ప‌లికారు.

మిచెల్ మార్ష్ రూ. 6.50 కోట్లు, రాయుడు రూ. 6.75 కోట్లు , ఇషాన్ కిష‌న్ రూ. 15.25 కోట్లు, జానీ బెయిర్ స్టో రూ. 6.75 కోట్లకు అమ్ముడ పోయారు.

దినేష్ కార్తీక్ రూ. 5.50 కోట్లు, నికోల‌స్ పూర‌న్ రూ. 10. 75 కోట్లు, టి. న‌ట‌రాజ‌న్ రూ. 4 కోట్లు, దీప‌క్ చాహ‌ర్ రూ. 14 కోట్లు, ప్ర‌సీద్ధ్ కృష్ణ రూ. 10 కోట్లకు అమ్ముడు పోయారు.

లాకీ ఫెర్గుస‌న్ రూ. 10 కోట్లు, హేజిల్ వుడ్ రూ. 7.75 కోట్లు, మార్క్ వుడ్ రూ. 7.50 కోట్లు, భువీ రూ. 4.20 కోట్ల(IPL Auction List) ధ‌ర ప‌లికారు.

శార్దూల్ రూ. 10. 75 కోట్లు, రెహ‌మాన్ రూ. 2 కోట్లు, కుల్దీప్ యాద‌వ్ రూ. 2 కోట్లు, రాహుల్ చాహ‌ర్ రూ. 5.2 కోట్లు ప‌లికారు.

యుజువేంద్ర చాహ‌ల్ రూ. 6.50 కోట్లు, ప్రియ‌మ్ గార్గ్ రూ. 20 ల‌క్ష‌లు, అభినవ్ స‌ద‌రంగాని రూ. 2.60 కోట్లు, బ్రెవిస్ రూ. 3 కోట్లు,

హెబ్బార్ రూ. 20 ల‌క్ష‌లు, రాహుల్ త్రిపాఠి రూ. 8.50 కోట్లు, రియాన్ ప‌రాగ్ రూ. 3.80 కోట్లకు అమ్ముడు పోయారు.

అభిషేక్ శ‌ర్మ రూ. 6. 50 కోట్లు, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రూ. 20 ల‌క్ష‌లు , షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లు,

శివ‌మ్ మావి రూ. 7.25 కోట్లు, రాహుల్ తెవాటియా రూ. 9 కోట్లు, క‌మ‌లేష్ నాగ‌ర్ కోటి రూ. 1.1 కోట్లు, బ్రార్ రూ. 3.8 కోట్లకు ధ‌ర ప‌లికారు.

షాబాద్ అహ్మ‌ద్ రూ. 2.40 కోట్లు, కేఎస్ భ‌ర‌త్ రూ. 2 కోట్లు, అనుజ్ రావ‌త్ రూ. 3.4 కోట్లు ,

ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ రూ. 60 ల‌క్ష‌లు, జితేష్ శ‌ర్మ రూ.20 ల‌క్ష‌లు, బాసిల్ థంపి రూ. 30 ల‌క్ష‌లు , కార్తీక్ త్యాగి రూ. 4 కోట్లు,

ఆకాశ్ దీప్ రూ. 20 ల‌క్ష‌లు, ఆసిఫ్ రూ. 20 లక్ష‌లు, తుషార్ రూ. 20 ల‌క్ష‌లు, అంకిత్ రాజ్ పుత్ రూ. 50 ల‌క్ష‌లకు అమ్ముడు పోయారు.

కార్తీక్ త్యాగి రూ. 4 కోట్లు, ఆకాశ్ దీప్ రూ. 20 ల‌క్ష‌లు, కేఎం ఆసిఫ్ రూ. 20 ల‌క్ష‌లు,ఆవేష్ ఖాన్ రూ. 10 కోట్లు , ఇషాన్ పోరెల్ రూ. 25 ల‌క్ష‌లు , 

తుషార్ రూ. 20 ల‌క్ష‌ల ధ‌ర ప‌లికారు. అంకిత్ రాజ్ పుత్ రూ. 50 ల‌క్ష‌లు, నూర్ అహ్మ‌ద్ రూ. 30 ల‌క్ష‌లు , మురుగన్ అశ్విన్ రూ. 1.60 కోట్లకు అమ్ముడు పోయారు.

Also Read : హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!