CSK Squad 2022 : మెగా వేలం ముగిసింది. వ్యూహాలను పన్నడంలోనే కాదు ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో దిట్ట చెన్నై సూపర్ కింగ్స్(CSK Squad 2022 )కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
అతడి సారథ్యంలోనే ఐపీఎల 2021 ఛాంపియన్ గా నిలిచింది. బెంగళూరు వేదికగా బీసీసీఐ నిర్వహించిన వేలం పాటలో సీఎస్కే ఎంపిక చేసిన ఆటగాళ్లు పూర్తిగా ధోనీపైనే ఆధారపడి ఎంపిక చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను సమన్వయం చేసుకునేలా ప్లాన్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా జట్టు పరంగా చూస్తే ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అద్భుతమైన ప్లేయర్లను ఎంపిక చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఏ సమయంలోనైనా ఆడగలడు. ఇక రాబిన్ ఊతప్ప షాట్స్ కొట్టడంలో దిట్ట. అంబటి రాయుడు ఈసారి వచ్చాడు జట్టులోకి . కాన్వే, సేనాపతి, నిషాంత్ , జగదీశన్ బ్యాటర్ లుగా పనికొస్తారు.
ఇక బౌలర్ల పరంగా చూస్తే దీపక్ చాహర్, ఆసిఫ్ , తుషార్ దేశ్ పాండే , తీక్షణ, సిమర్ జీత్ , మిల్నే , ముకేశ్, మొయిన్ బలంగా కనిపిస్తోంది.
ఇక ఆల్ రౌండర్ల పరంగా చూస్తే రవీంద్ర జడేజా, బ్రావో, శివమ్ దూబే , హంగర్ గేకర్ , ప్రిటోరియస్ , శాంట్నర్ , ప్రశాంత్ సోలంకి, జోర్డాన్ , భగత్ ఉన్నారు.
మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్థాయిలో అత్యంత బలంగా ఉంది. ధోనీ తనకు తగ్గట్టుంగా తయారు చేసుకున్నాడు. ఈసారి జరిగే లీగ్ ఆఖరి లీగ్ అని సమాచారం.
ఇక సీఎస్కేకు యజమానిగా ఇండియా సిమెంట్స్ వ్యవహరిస్తోంది. మొత్తం వేలం పాటలో క్లాస్ ప్లేయర్లను సీఎస్కే తీసుకోవడం విశేషం.
Also Read : వేలంలో టిమ్ డేవిడ్..రొమారియో అదుర్స్