Gujarat Titans Squad : బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముచ్చటగా ముగిసింది. మొత్తం 590 మంది క్రికెటర్ల కు గాను 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇందులో 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి.
మొత్తం రూ. 551 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి ఆటగాళ్ల మీద. ఇప్పటి దాకా జరిగిన ఐపీఎల్ లీగ్ లలో కేవలం 8 ఫ్రాంచైజీలకు సంబంధించిన జట్లు మాత్రమే పాల్గొన్నాయి.
దీంతో రెండు కొత్త ఫ్రాంచైజీలకు బిడ్ ఆహ్వానించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ. ఇందులో భాగంగా బీసీసీఐకి ఊహించని రీతిలో ఆదాయం సమకూరింది.
ఏకంగా 1725 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ తరుణంలో తాజాగా నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంది గుజరాత్ టైటాన్స్(Gujarat Titans Squad ). ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం భారత జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను తీసుకుంది.
ఇప్పటికే ఐపీఎల్ లో అపారమైన ఆడిన అనుభవం ఉంది పాండ్యాకు. స్టార్ ప్లేయర్లతో నిండుగా ఉంది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans Squad ). బ్యాటర్లు గా చూస్తే పాండ్యాతో పాటు ఇల్, జాసన్ రాయ్ , అభినవ్ , మిల్లర్, సాహా ఉన్నారు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, ఫెర్గూసన్ , రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్ , సాయి కిశోర్ , యాష్ దయాల్ , జోసెఫ్ ప్రదీప్ సంగ్వన్ , అర్వన్ లు ఉన్నారు. ఇ
క ఆల్ రౌండర్ల పరంగా చూస్తే రాహుల్ తెవాటియా, డ్రేక్స్ , జయంత్ , విజయ్ శంకర్ , నల్ కందే, గుర్ కీరత్ , సుదర్శన్ సేవలు వాడుకోనుంది గుజరాత్ టైటాన్స్ . ఇక ఈ జట్టుకు యజమానిగా సీవీసీ క్యాపిటల్స్ పార్ట్ నర్స్ ఉంది.
Also Read : రూ. 551 కోట్లు 204 క్రికెటర్లు ఎంపిక