Lucknow Super Giants Team : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022కు సంబంధించి మెగా వేలం పాట ముగిసింది. మొత్తం 590 మందిని తుది సెలక్షన్ కు ఎంపిక చేసింది బీసీసీఐ.
మొత్తం ఆటగాళ్లలో కేవలం 204 మంది ఆటగాళ్లు మాత్రమే అమ్ముడు పోయారు.
మిగతా 386 మంది ప్లేయర్లను పట్టించు కోలేదు. వారినందరినీ ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి.
ఇక ఇప్పటి వరకు సాగిన ఐపీఎల్ లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ప్రస్తుతం రెండు ఫ్రాంచైజీలు కొత్తగా జాయిన్ అయ్యాయి. బీసీసీఐ ఇటీవల ఇంటర్నేషనల్ స్థాయిలో బిడ్ వేసింది.
ఈ వేలం పాటలో ఈసారి గుజరాత్ టైటాన్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants Team)సూపర్ రెడీ అయ్యింది.
ఇప్పటికే ముందు జాగ్రత్తగానే లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా మాజీ భారత జట్టు క్రికెటర్ , ప్రస్తుతం బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ను ఎంపిక చేసింది యాజమాన్యం.
ఈసారి జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటుంది. మొత్తం జట్లలో కంటే అత్యధిక ధరకు కొనుగోలు చేసింది కేఎల్ రాహుల్ ను ఈ యాజమాన్యం.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరంగా చూస్తే చాలా బలంగా కనిపిస్తోంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ గా పేరొందిన కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు.
బ్యాటర్ల పరంగా చూస్తే డికాక్, మనీశ్ పాండే, మనన్ వోహ్రా, లూయిస్ ఉన్నారు. ఇక బౌలర్లు బాగానే ఉన్నారు. వీరిలో మార్క్ ఉడ్ ,
అవేశ్ ఖాన్ , అంకిత్ రాజ్ పుత్, రవి బిష్ణోయ్ , దుష్యంత్ చమీర, షాబాజ్ నదీం, మోహిసిన్ ఖాన్ , మయాంక్ యాదవ్ (Lucknow Super Giants Team)ఉన్నారు.
ఇక ఆల్ రౌండర్లలో స్టొయినిస్ , హోల్డర్ , దీపక్ హూడా, క్రునాల్ పాండ్యా,
కృష్ణప్ప గౌతమ్ , బదోని, మేయర్స్ , కరన్ శర్మ ఉన్నారు. ఇక ఈ జట్టుకు యజమానిగా ఆర్పీఎస్సీజీ ఉంది.
Also Read : సీఎస్కే ఎంపికపై ధోనీ మార్క్