SRH Squad : ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయ‌ర్ల ఎంపిక అదుర్స్

యువ క్రికెట‌ర్ల‌కే సిఇఓ కావ్య మార‌న్ ఆస‌క్తి

SRH Squad : ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో స్ట్రాట‌జీని అమ‌లు చేసింది. 590 మందికి గాను 204 మంది ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే ఎంపిక చేసుకున్నాయి ఫ్రాంచైజీలు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఆటగాళ్ల‌కు ధ‌ర పెంచేలా చేసింది. అయితే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH Squad) మాత్రం ఊహించ‌ని రీతిలో ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

దీని వెను ఆ ఫ్రాంచైజ్ సిఇఓగా ఉన్న కావ్య మార‌న్ ప్ర‌భావం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక రాబోయే ఐపీఎల్ ఫైట్ కు రెడీ అంటున్నాయి. గ‌తంలో లాగా కాకుండా ఈసారి ఎంపిక‌లో భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది యాజ‌మాన్యం.

ఉన్న రూ. 64 కోట్ల‌తో ఎక్కువ మంది యువ‌కుల‌కే ప్ర‌యారిటీ ఇచ్చింది. అత్య‌ధికంగా కేన్ విలియ‌మ్స‌న్ కు రూ. 14 కోట్లు వెచ్చింది. స‌మ‌ద్ కు రూ. 4 కోట్లు, మాలిక్ కు రూ. 4 కోట్ల‌తో రీటైన్ చేసుకుంది ఎస్ఆర్ హెచ్. ఏకంగా 20 మంది కొత్త వాళ్ల‌ను ద‌క్కించుకుంది.

మిగ‌తా జ‌ట్లు ఊహించ‌ని రీతిలో పూర‌న్ ను రూ. 10. 75 కోట్ల‌కు, సుంద‌ర్ ను రూ. రూ. 8.75 కోట్ల‌కు , త్రిపాఠిని రూ. 8.5 కోట్ల‌కు, షెఫ‌ర్డ్ ను రూ. 7.7 కోట్ల‌కు, అభిషేక్ శ‌ర్మ‌ను రూ. 6.5 కోట్ల‌కు తీసుకుంది.

ఇక మిగ‌తా ఆటగాళ్ల ప‌రంగా చూస్తే అభిషేక్ శ‌ర్మ‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ , మార్కో జ‌న్నెన్ , టి. న‌ట‌రాజ‌న్ , కార్తీక్ త్యాగి, మార్క్ర‌ర‌మ్ , అబాట్, గ్లెన్ ఫిలిప్ ఉన్నారు.

వీరితో పాటు శ్రేయ‌స్ గోపాల్ , విష్ణు వినోద్ , ఫారుఖి, సుజిత్ , ప్రియ‌మ్ గార్గ్ , స‌మ‌ర్త్, శశాంక్ సింగ్ , సౌర‌భ్ ల‌ను ద‌క్కించుకుంది.

Also Read : సీఎస్కే ఎంపికపై ధోనీ మార్క్

Leave A Reply

Your Email Id will not be published!