Gutta Jwala : కన్నడ నాట స్టార్ట్ అయిన హిజాబ్ వివాదం దేశాన్ని దాటి ప్రపంచాన్ని సైతం స్పందించేలా చేసింది. ముస్లిం మహిళలు ధరించే హిజాబ్ కు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
దీనికి సంబంధించిన అంశం హైకోర్టులో నడుస్తోంది. ఇంకో వైపు వెంటనే విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే దానిని తప్పు పట్టింది సర్వోన్నత న్యాయ స్థానం.
హైకోర్టులో కేసు నడుస్తోందని ఎవరూ దీని గురించి చర్చించ కూడదంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం హిజాబ్ వివాదం దీనిపై స్పందించారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల(Gutta Jwala ). బాలికలను చదువునేందుకు అవాకశం ఇవ్వండి.
వాళ్లను స్కూల్ గేట్ల వద్ద అవమానిస్తారా అంటూ సీరియస్ అయ్యింది. నీచమైన రాజకీయాల కోసం ఇలాంటి వాటిని ప్రమోట్ చేయవద్దంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది గుత్తా జ్వాల.
పసి హృదయాలను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్లు దేనినీ నేర్చుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేసిన ట్వీట్ నెట్టింట్టో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా కర్ణాటక లోని మాండ్యాలోని రోటరీ స్కూల్ కు హిజాబ్ ధరించి వచ్చిన స్టూడెంట్స్ ను యాజమాన్యం లోపలికి అనుమతించ లేదు.
దీంతో వాళ్లు పరీక్షలు రాకుండానే తిరిగి ఇంటికి వెళ్లి పోయారు. ఇది దేశమంతటా చర్చకు దారి తీసింది. దీంతో పేరెంట్స్ కు, టీచర్లకు వాగ్వావాదం చోటు చేసుకుంది. నో చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉండగా ఇవాళ కూడా హైకోర్టులో విచారణకు రానుంది హిజాబ్ వివాదం.
Also Read : లక్నో సూపర్ జెయింట్స్ సూపర్